తిరుమలలో ఈ నెల 20 వరకు వీఐవీ దర్శనాలకు బ్రేక్

తిరుమలలో ఈ నెల 20 వరకు వీఐపీ దర్శనాలను నిలిపేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకొంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకొంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత నిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సెలవులు, పెళ్లి ముహూర్తాల వల్ల కొండపై భక్తుల రద్దీ పెరిగిందని వివరించారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: