తెలంగాణ‌లో ఈ సెట్ ప‌రీక్ష వాయిదా


భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జనజీవనాన్ని స్థంభింపజేస్తోంది.  గ‌డ‌చిన రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా తెలంగాణ‌లో ఈ సెట్ ప‌రీక్ష వాయిదా ప‌డింది. ఈ నెల 13 (బుధ‌వారం)న జ‌ర‌గాల్సిన ఈ సెట్ ప‌రీక్షను వ‌ర్షాల కార‌ణంగా వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్న‌త విద్యా మండలి చైర్మ‌న్ లింబాద్రి సోమ‌వారం ప్ర‌క‌టించారు. అయితే ఈ నెల 14 నుంచి జ‌ర‌గ‌నున్న ఎంసెట్ య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.  రాష్ట్రంలో భారీ వ‌ర్షాల కార‌ణంగా విద్యా సంస్థ‌ల‌కు ఈ నెల 13 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 13న జ‌ర‌గాల్సిన ఈ సెట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ఉన్న‌త విద్యా మండ‌లి తెలిపింది. ఈ ప‌రీక్ష‌ను తిరిగి ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌న్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని మండ‌లి అధికారులు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: