గని , పిన్నాపురం గ్రామాలను నంద్యాల జిల్లాలోనే కలపాలి

 విద్యార్ధి , యువజన , వామపక్ష సంఘాల నాయకుల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

గడివేముల మండలం గని , పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాలను ఓర్వకల్లు మండలంలో కలపాలనే ప్రతిపాధనను విరమించుకోవాలని , ఈ  రెండు గ్రామాలు ఆయా మండలాలలోనే కొనసాగుతూ నంద్యాల జిల్లాలోనే ఉంచాలని, ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ కి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) , ఎస్.ఎఫ్.ఐ ,  ఆర్.ఎస్.ఏ , ఏ.ఐ.వై.ఎల్ , డీబీఎస్ఎఫ్ , ఏపీ స్టూడెంట్స్ జేఏసీ నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు , రాయలసీమ స్టూడెంట్స్ అసోషియేషన్ (ఆర్.ఎస్.ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు , ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి నిరంజన్ , విద్యార్ధి , యువజన నేతలు పూల వెంకట్ , లక్ష్మణ్ , పాపసాని వేణుమాధవ రెడ్డి , డీసీ.నాగన్న లు మాట్లాడుతూ గడివేముల , పాణ్యం మండలాలు నంద్యాలతో అనేక సంవత్సరాల నుండి వ్యాపారం , ఉద్యోగాలు , వాణిజ్యం అనేక వర్తకాలతో ముడిపడి ఉందనీ , నూతన జిల్లాల ఏర్పాటులో పాణ్యం , గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలోనే కలపాలనీ కోరుతూ రెండు మండలాల ప్రజానీకం విద్యార్ధి , యువజన సంఘాల నేతలతో కలిసి సుమారు మూడు నెలల సుధీర్ఘ పోరాటం , నిరసనలు , వినతులు ఇస్తే , స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మండలాలను నంద్యాల జిల్లాలోనే కలిపారన్నారు.


మరలా నేడు గని , పిన్నాపురం గ్రామాలను ఓర్వకల్లు మండలంలో కలపాలనే ప్రతిపాధన తెరమీదకు రావడం భాధాకరమన్నారు. ఇప్పటికైనా రెండు గ్రామాలలోని ప్రజా ప్రతినిధులు , సర్పంచులు స్పందించి ప్రజా ప్రయోజనార్ధం ఓర్వకల్లుకు వ్యతిరేఖంగా రద్దు తీర్మానాన్ని చేయాలన్నారు. లేదంటే ప్రజలతో ప్రతి రోజూ పోరుబాట సాగిస్తామన్నారు. స్పందించిన జిల్లా కలెక్టర్  మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ ఈ విషయం మా దృష్ఠికి రాలేదనీ , ఇప్పటికై పలుమార్లు ఈ రెండు గ్రామాల ప్రజలు వినతి పత్రాలు అందజేశారనీ , దీనిపై పూర్తి స్ధాయి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: