ఉచిత విద్య..వైద్యం అందించడం నేరమా: మోడీపై భగ్గుమన్న కేజ్రీవాల్


ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడం కూడా నేరమా అని ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఓట్ల కోసం ఉచిత హామీలు ఇస్తున్నారని, ప్రజలను తాయిలాలతో మభ్యపెడుతున్నారని, ఇది ప్రమాదకరమైన సంస్కృతి అంటూ ఇతర పార్టీలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేయడం తెలిసిందే. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులకు ఉచిత విద్య, ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం తాయిలాలు ఇవ్వడం కాదని స్పష్టం చేశారు. 

"నన్ను ఉద్దేశించి ఈ ఆరోపణలు చేశారని నాకు తెలుసు. కానీ నేను చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మేం నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఖర్చులేని, మంచి విద్యను అందించడం నేరమా?" అని ప్రశ్నించారు. "ఇదంతా 1947, 1950లోనే చేయాల్సింది. మేం ఇప్పుడు దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాం. ఇది ఉచితంగా తాయిలాలు ఇస్తున్నట్టుకాదు" అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: