కర్నూలుకు హైకోర్టు , కేంద్ర విశ్వవిద్యాలయం

విద్యార్ధి నేతలకు బుగ్గన హామీ

మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన జేఏసీ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్ గడివేముల ప్రతినిధి)

 నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన  బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని  ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ఆధ్వర్యంలో  రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతలు కలిశారు. కర్నూలుకు హైకోర్ట్ , కేంద్ర విశ్వ విద్యాలయం , నంద్యాలలో రాష్ట్ర  న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రికి జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ నేతల తో బుగ్గన రాజేంద్రనాధ్  మాట్లాడుతూ  ప్రజల హృదయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలను  అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని, కర్నూలు జిల్లాకు  హైకోర్ట్ , న్యాయ విశ్వవిద్యాలయం రావడానికి ప్రభుత్వం నుండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్లు బి. శ్రీరాములు , రామినేని రాజునాయుడు , బందెల ఓబులేసు , రవీంద్రనాధ్ , వెంకట్ , వేణు మాధవ రెడ్డి , ఆర్వీఎఫ్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: