తెలంగాణ శాసనసభలో...ఏపీ ఎమ్మెల్యే ఓటు


వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి పొరుగు రాష్ట్ర శాస‌న స‌భ‌లో ఓటు వేయ‌నున్నారు. సోమ‌వారం తాను తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉండాల్సి ఉంద‌ని, ఈ క్ర‌మంలో తెలంగాణ అసెంబ్లీలోనే ఓటు వేస్తాన‌ని ఈసీని కోరారు. ఇందుకు ఆయ‌న చెప్పిన కార‌ణం స‌హేతుక‌మైన‌దేన‌ని భావించిన ఈసీ... తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేసేందుకు మ‌హీధ‌ర్ రెడ్డిని అనుమ‌తించింది.

ఇదిలావుంటే భార‌త రాష్ట్రప‌తి ఎన్నికల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్‌కు శ‌నివారం నాటికే ఏర్పాట్ల‌న్నీ పూర్తయ్యాయి. ఈ నెల 18న‌ (సోమ‌వారం) పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీలోని పార్ల‌మెంటుతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ప్రాంగ‌ణాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఎంపీలు ఢిల్లీలో ఓటు వేయాల్సి ఉండ‌గా ఆయా రాష్ట్రాల‌కు చెందిన ఎమ్మెల్యేలు త‌మ రాష్ట్రాల అసెంబ్లీల్లోనే ఓటు వేయాల్సి ఉంది.

అయితే ఏదేనీ ప్ర‌త్యేక కార‌ణాల వ‌ల్ల ఒక రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే అటు ఢిల్లీలో గానీ, లేదంటే త‌న‌కు అందుబాటులో ఉండే రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో గానీ ఓటు వేసేందుకు కూడా అనుమ‌తి ఉంది. అయితే ఈ మేర‌కు ఆయా స‌భ్యులు ముందుగానే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నుంచి అనుమ‌తి పొందాల్సి ఉంటుంది. లేదంటే ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ వేరే చోట ఓటు వేసేందుకు అనుమ‌తి లేదు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: