తప్పు చేశాం అని నిరూపిస్తే ...

గడివేముల జడ్.పి.టి.సి. పదవికి రాజీనామా

 ఆర్.బి.చంద్ర శేఖర్ రెడ్డి సవాల్

 (జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

మండల కేంద్రమైన గడివేములలో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో జడ్పిటిసి ఆర్. బి  చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల క్రితం సోమవారం నాడు స్పందన కార్యక్రమం లో కలెక్టర్ గారికి గడివేముల గ్రామ సర్పంచ్ రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఖండించమన్నారు. ఈ ఫిర్యాదు పూర్తి తప్పుడు ఫిర్యాదు అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జడ్పిటిసి ఆర్.బి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి అసత్య ఆరోపణలు తప్ప వారు ఇచ్చిన ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదని,గ్రామ సర్పంచ్ సంతకం చేసి నేను చేయలేదని కలెక్టర్ దగ్గరికి వెళ్లి చెప్పడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని , ఈ ఫిర్యాదు నిజం అని తేలితే నా జడ్పటిసి పదవికి రాజీనామా చేస్తానని, తప్పుడు ఫిర్యాదు అని తేలితే మీరు మీ సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.


ఈ ఫిర్యాదులో పూర్తిస్థాయి విచారణ జరిగాలని ,చెక్కును ఫోరెన్సిక్ లాబ్లో టెస్ట్ చేయించి నిజాలు నెగ్గు తేల్చాలని, గ్రామ సర్పంచ్ సంతకం పెట్టకపోతే మరికొన్ని రోజులు వేచి చూసి అధికారులకు ఫిర్యాదు చేసి  బిల్లులు పాస్ చేయించుకునేవారము అని దొంగ సంతకాలు చేసి ఫోర్జరీ చేయాల్సినంత కర్మ మాకు లేదు. నంద్యాల జిల్లా ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదు పై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఇటువంటి తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన గ్రామ సర్పంచ్ రమణమ్మ పై విచారణ జరిపి ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్.బి. చంద్ర శేఖర్ రెడ్డి కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి ప్రణావృతం కాకుండా నంద్యాలజిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గతంలో కూడా రైతు భరోసా కేంద్రానికి సంబంధించి బిల్లులకు సంబంధించి సర్పంచ్ రవణమ్మ సంతకం పెట్టకుండా నెల రోజులపాటు ఇబ్బందికి గురి చేసిన సంగతి అందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు ఈ 32 లక్షల 52వేల 770 రూపాయలు బిల్లు చెక్కుపై సర్పంచ్ స్వహస్తాలతో సంతకం చేసి అది నా  సంతకం కాదు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కావున వీరిపై సంతకం చేసి ఫోర్జరీ అని తప్పుడు ఫిర్యాదు చేసినందున జిల్లా కలెక్టర్ ని కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని మండల నాయకులంతా కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు ఆర్బి మల్లారెడ్డి మాట్లాడుతూ ఖర్చు పెట్టిన మూడు సంవత్సరాల తర్వాత మా బిల్లులు మేము తీసుకుంటే ఏదో వారి సొమ్మును ఫోర్జరీ చేసి తీసుకుంటున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మూడు సంవత్సరాల నుండి ఖర్చు పెట్టిన వాటికి బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఇప్పుడు బిల్లులు చేతికి వస్తే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ బిలకల గూడూరు వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సంతకం పెట్టి పెట్టలేదు అని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు తీవ్రంగా పరిగణించాలని పరీక్షించి నిజా నిజాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  అనంతరం గడివేముల గ్రామ ఉపసర్పంచ్ బాల చెన్ని మాట్లాడుతూ ఈ ఫిర్యాదు నిజమని తేలితే నా ఉపసర్పంచ్ పదవికి మరియు నా భార్య ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తామని ఫిర్యాదు తప్పు అని తేలితే మీరు సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు.  ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి. వంగాల మహేస్వేస్వర రెడ్డి, మంచాలకట్ట అనీల్ కుమార్ రెడ్డి, గని ప్రతాప్ రెడ్డి, తండా కాలు నాయక్, ఒందుట్ల రవి రెడ్డి, పెసరవాయి ఎల్లా రెడ్డి, గడిగరేవుల సర్పంచ్, ఎం.పి.టి.సి, దుర్వేసి బి.రమేష్ మరియు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: