మాస్క్ ధరించాల్సిందే...లేకపోతే రూ.500 ఫైన్


కరోనా నియంత్రణకు చెన్నై మున్సిపల్  కార్పోరేషన్  నడుంభిగించింది. ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మాస్క్ ధరించడంతో పాటు... బహిరంగ ప్రదేశాల్లో అందరూ భౌతికదూరాన్ని పాటించాలని ఆదేశించింది. కొనుగోలుదారులను ఒకేసారి పెద్ద సంఖ్యలో అనుమతించవద్దని మాల్స్, వాణిజ్య సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నందువల్లే మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

మాల్స్, థియేటర్స్, వస్త్ర దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని చేసేవారు మాస్క్ కచ్చితంగా ధరించాలని చెప్పింది. మాస్క్ లేనివారికి తమిళనాడు ప్రజా ఆరోగ్య చట్టం 1939 ప్రకారం రూ. 500 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనవసరంగా బయట తిరగడాన్ని తగ్గించుకోవాలని చెప్పింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: