తెలియక జరిగిన పొరపాటుకు భేషరతుగా క్షమాపణ చెబుతున్నాం

సర్బానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్

(జానో జాగో వెబ్ న్యూస్ - హైదరాబాద్ బ్యూరో)

తమ కంపెనీకి చెందిన బియ్యం సంచుల పై అల్లాహ్ అని పొరపాటుగా  ప్రచురితమైనందుకు ముస్లిం సమాజానికి భేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు సర్బానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ప్రింటర్ చేసిన పొరపాటు కారణంగా తమ కంపెనీ సంచులపై అల్లాహ్ అని ప్రచురితమైందని సర్బానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ మిట్టల్ తెలియజేశారు. ఈ మేరకు సర్బానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున వారి న్యాయవాది అద్నాన్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. సర్బానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన బియ్యపు సంచులపై అల్లాహ్ పేరు ప్రచురితమైనందుకు గాను 2022 జూన్ 7న సోహైల్ క్వాద్రీ మరియు ఇతరులు మీ చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బియ్యపు సంచులపై ఈ విధంగా అల్లాహ్ పేరును ప్రచురించడం ద్వారా ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారని ఫిర్యాదుదారులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


దీనిపై స్పందించిన సర్బానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం ఈ మేరకు ముస్లిం సమాజానికి బేషరతు క్షమాపణ కోరింది. తెలియకుండానే ఈ పొరపాటు జరిగిందని, అలాంటి తప్పు చేసినందుకు కంపెనీ పశ్చాత్తాపపడుతూ, ముస్లిం సమాజ సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, తక్షణమే ఆ పేరుతో ఉత్పత్తి విక్రయాలను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. రిటైలర్ల నుండి ఇప్పటికే ఉన్న అన్ని బియ్యం సంచులను కూడా రీకాల్ చేస్తుంది, భవిష్యత్తులో అలాంటి పొరపాటు జరగకుండా చూస్తుంది అని అని ఆ కంపెనీ తరఫు న్యాయవాది అద్నాన్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: