రేషన్ బియ్యం పట్టివేత

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోన కొరటమద్ది గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని గడివేముల ఎస్ఐ బీ.టీ.వెంకటసుబ్బయ్య ఆకస్మిక దాడులు జరిపి అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే బండి ఆత్మకూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రమణమ్మ (50), సోమయాజుల పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు(34)  అనే వ్యక్తులు గ్రామంలో ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి వెలుగోడు మండలం లో అధిక ధరలకు విక్రయించేందుకు నిల్వ ఉంచిన 90 బస్తాలు (సుమారు 1450 కేజీలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: