చిన్నపిల్లల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

గడివేముల మండల వైద్యాధికారి సృజన


(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ సృజన గడివేముల మండలంలో " అతిసార నియంత్రణ పక్షోత్సవాలు" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య అధికారిని సృజన మాట్లాడుతూ 13-06 -22 నుండి 27-06-22 వరకు గడివేముల మండలంలోని అన్ని గ్రామాలలో 01 సంవత్సరం నుండి 05 సంవత్సరాల లోని పిల్లలందరికీ బిలకలగూడూరు గ్రామంలో ORS ప్యాకెట్లను మరియు జింక్ మాత్రలను పంపిణీ చేశామని తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల,పిల్లలు భుజించే ఆహార పదార్థాల వల్ల, చిన్న పిల్లలకు కు డయేరియా (విరోచనాలు) ఏర్పడతాయని అలాంటి సమయంలో  చిన్న పిల్లలకు తల్లిపాలు, ORS  ద్రావణాన్ని తరచూ తాగిస్తూ ఉండాలని,


చిన్న పిల్లలకు 06 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి అని, చిన్న పిల్లలకు ఆహారం తినిపించే ముందు వంట చేసే ముందు, మలమూత్రాల విసర్జన అయిన తరువాత మాతృమూర్తులు చేతులు  నీటితో శుభ్రపరచుకోవాలి అని,  విరోచనాలు సమయంలో చిన్న పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన ద్రావణం (ORS)తో పాటు తగిన మోతాదులో


జింకు మాత్రలు 14 రోజులు మాత్రమే ఉపయోగించాలని, పిల్లలకు డయేరియా (విరోచనాలు )ఎక్కువ అవుతున్న వారు ఆరోగ్య పరంగా డీహైడ్రేషన్ (నీరసం) కు లోనవుతారని, అలాంటి వారిని ప్రభుత్వ వైద్యశాలకు తప్పనిసరిగా తీసుకుని వచ్చి ప్రభుత్వం అందించే వైద్య సేవలు పిల్లల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని గడివేముల ప్రభుత్వ వైద్యశాల అధికారిని డాక్టర్ సృజన తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: