చిత్తశుద్ధితో పనిచేస్తే పదవులు వస్తాయి


చిత్తశుద్ధితో ప్రజలకు ప్రేమతో సేవలందిస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి గవర్నర్ తమిళిసై నిలువెత్తు తార్కాణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు తెలంగాణ గవర్నర్ తమిళిసై పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జనసేనాని పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ కుటుంబంలో జన్మించి, వైద్య శాస్త్రాన్ని అభ్యసించి, వైద్య వృత్తిలో ఎన్నో విజయాలను చవిచూసిన తమిళిసై గారిని నేటి యువతులకు ఆదర్శమూర్తిగా భావిస్తున్నానని చెప్పారు. 

వైద్య సేవలు అందిస్తూనే, కుటుంబ నేపథ్యంగా వచ్చిన రాజకీయ రంగాన కూడా ఆమె తనదైన పాత్రను పోషిస్తూ, నేడు గౌరవప్రదమైన గవర్నర్ స్థాయికి ఎదిగారని అన్నారు. ఒక్క తెలంగాణకే కాకుండా పుదుచ్చేరికి కూడా ఇంఛార్జి గవర్నర్ గా నియమితులవ్వడం ఆమెలోని పరిపాలన దక్షతకు నిదర్శనమని చెప్పారు. చిత్తశుద్ధితో ప్రజలకు ప్రేమతో సేవలందిస్తే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పడానికి తమిళిసై గారు నిలువెత్తు తార్కాణమని అన్నారు. ఆమెకు ఆ భగవంతుడు శతాయుష్షును ప్రసాదించాలని, ప్రజాసేవలో ఆమె నిరంతరంగా మమేకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: