ఇలా చేస్తే హార్ట్ ఎటాక్ రిస్క్ ను కాస్త తగ్గించగలం
మొన్నటి వరకు బాగానే ఉన్నాడు..కానీ అకస్మత్తుగా ఇపుడు ఇలా  పోయాడు. ఏంటి కారణం అని అడిగితే హార్ట్ ఎటాక్ అని సమాధానం వస్తుంది. ఈ రోజుల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ బాగా పెరిగిపోతోంది.  మయోకార్డియల్ ఇన్ఫార్ క్షన్ అంటే హార్ట్ ఎటాక్. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందని సందర్భాల్లో గుండె పోటు వచ్చి, ఆ తర్వాత గుండె అరెస్ట్ అవుతుంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటా ప్రకారం.. తీవ్రమైన నొప్పి లేదా కరోనరీ ఆర్టరీ సంకోచించడం వల్ల గుండెకు రక్త సరఫరా ఆగిపోయి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. 

ప్రముఖ గుండె వైద్యనిపుణుడు, మేదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘ఆర్టరీల్లో ముందు నుంచే బ్లాకేజీలు ఉండి ఉండొచ్చు. అలాగే, అధిక రక్తపోటు ఉన్నా కూడా ఆర్టరీ రప్చర్ అవుతుంది. దీంతో తవ్రమైన హార్ట్ ఎటాక్ వస్తుంది. కరోనా మహమ్మారి కూడా మరొక రిస్క్ ఫ్యాక్టర్ గా మారింది’’ అని చెప్పారు.

లక్షణాలు

ఛాతీలో నొప్పి, అసౌకర్యంగా అనిపించడం.. బలహీనత... తలతిరుగుతున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తున్నా.. తలతిరిగి పడిపోతున్నా.. దవడ, మెడ, వీపు భాగంలో నొప్పి, అసౌకర్యం అనిపించినా.. శ్వాస చాలడం లేదని అనిపించినా.. ఇవన్నీ గుండె సమస్యకు లక్షణాలుగా భావించి వైద్య పరీక్షలకు వెళ్లాలి.

రిస్క్ తగ్గించుకోవడం

ఆరోగ్యకరమైన జీవనశైలితో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక వ్యాయామం ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్నే తీసుకోవాలి. పొగతాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ‘‘వయసు, కుటుంబ చరిత్ర మన చేతుల్లో ఉండేది కాదు. రిస్క్ ను తగ్గించుకునే చర్యల వరకే మన చేతుల్లో ఉండేది’’ అని అమెరికా సీడీసీ సూచన.

ఛాతీపై బలంగా అదుముతూ గుండె కండరాల్లో తిరిగి స్పందన వచ్చేందుకు చేసే సీపీఆర్ గురించి కూడా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నది వైద్యుల సూచన. ఇందుకు సంబంధించి యూట్యూబ్ లో వీడియోలు బోలెడు ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ చేసిన వీడియో సైతం ఉంది. గాయకుడు కేకేకు సీపీఆర్ చేసి ఉంటే బతికేవాడన్నది వైద్యుల అభిప్రాయం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: