ఫేమస్ కావాలని మేకను పెళ్లాడాడు


ఫేమస్ కావాలను కొన్నాడు..అందుకు సరైనా వేదిక సోషల్  మీడియా అని భావించాడు. కాకపోతే పాపులర్ కావాలంటే ఓ ప్రత్యేకతచాటాలి మరి. ఇండోనేషికు  చెందిన సైఫుల్ ఆరిఫ్ (44) అనే వ్యక్తి అదే చేశాడు. జూన్ 5వ తేదీ గ్రెసిక్‌లోని బెంజెంగ్ జిల్లాలోని క్లాంపోక్ గ్రామంలో శ్రీ రహయు బిన్ బెజో అనే మేకను వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆరిఫ్ జావానీస్ దుస్తులు ధరించి కనిపించగా, మేకను శాలువాతో అలంకరించారు. సంప్రదాయ జావానీస్ దుస్తులు ధరించిన స్థానికుల బృందం పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అంతేకాదు వరుడు ఆడ మేకకు 22 వేల రూపాయలను కట్నంగా కూడా ఇచ్చాడు.

సోషల్ మీడియా దయ వల్ల చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. అతి సామాన్యులు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ప్రజలకు దగ్గరవుతున్నారు. దీంతో ఓ వ్యక్తి కూడా తాను పాపులర్ అవ్వాలనుకున్నాడు. దాని కోసం ఓ వింత పని చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుందనే ఆశతో ఇండోనేషియాకు చెందిన ఆ వ్యక్తి ఆడ మేకను పెళ్లి చేసుకున్నాడు.

అయితే సైఫుల్ ఆరిఫ్ అనుకున్నట్టుగానే వీడియో వైరల్ అయింది. కానీ ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదొక అసహ్యకరమైన కంటెంట్ అని, ఇలాంటి వాటివల్ల డబ్బు వస్తుంది కానీ, ప్రజలకు సమస్యలు వస్తాయని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. అలాగే "పెళ్లి చేసుకునే వారిని మాత్రమే నిందించకూడదు, ఇలాంటి పెళ్లికి మద్దతు ఇస్తున్న గ్రామ పెద్ద, చుట్టుపక్కల ప్రజలు వెర్రివాళ్లని నేను అనుకుంటున్నాను. వారు దానిని ప్రోత్సహించారు." అని కామెంట్ పెట్టారు.

దీంతో సైఫుల్ అంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాడు. ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమేనని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో చేయ‌లేద‌ని పేర్కొన్నాడు. ఇది పూర్తిగా నటన అని, దానిని వైరల్ చేయాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియా కంటెంట్ కోసం రూపొందించామని చెప్పుకొచ్చారు. కేవలం ప్రేక్షకులను అలరించడం కోసమే రూపొందించామని ఆయన తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: