వారు ప‌విత్ర‌తకు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించారు: టీటీడీ


తిరుమ‌ల ప‌విత్ర‌తకు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించిన న‌య‌న‌తార దంప‌తుల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నామ‌ని టీటీడీ ప్ర‌క‌టించింది. వారిపై ఏఏ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేయ‌వచ్చ‌న్న విష‌యంపై చ‌ర్చిస్తున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నయనతార  దంపతుల  వ్య‌వహారంపై తాజాగా తిరుమ‌ల తిరుపతి దేవ‌స్థానం (టీటీడీ) ఇలా స్పందించింది. శ్రీవారి ఆల‌యం స‌మీపంలోనే న‌య‌న‌తార దంప‌తుల ఫొటోషూట్‌పై టీటీడీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. న‌య‌న‌తార కాళ్ల‌కు చెప్పుల‌తోనే మాడ వీధుల్లో సంచ‌రించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించింది. 

ఇదిలావుంటే  వివాహానంత‌రం తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నానికి వ‌చ్చిన న‌య‌న‌తార‌, విఘ్నేశ్ శివ‌న్ దంప‌తులు.. తిరుమ‌ల కొండ‌పై శ్రీవారి ఆల‌యం చుట్టూ ఉన్న మాడ‌ వీధుల్లో తిరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విఘ్నేశ్ చెప్పులు విడిచి న‌డిచినా.. న‌య‌న‌తార మాత్రం చెప్పుల‌తోనే మాడ‌ వీధుల్లో తిరిగారు. అంతేకాకుండా శ్రీవారి ఆల‌యం ప్ర‌ధాన ద్వారానికి అత్యంత స‌మీపంలోనే వారు ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. ఇలా తిరుమ‌ల ప‌విత్ర‌త‌కు న‌య‌న‌తార దంప‌తులు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించిన తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: