సమస్యలను పరిష్కరించిన..... మండల అభివృద్ధి అధికారి, తహశీల్దార్

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని తిరుపాడు గ్రామానికి చెందిన దాసరి వెంకట సుబ్బయ్య తన ఇంటి స్థలాన్ని తిరుపాడు గ్రామంలోని చింతకాయల నరసింహులు అనే వ్యక్తి కబ్జా చేశారని నంద్యాలలో జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఎమ్మార్వో నాగమణి తిరుపాడు గ్రామానికి వెళ్లి ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి సమస్యను అడిగి తెలుసుకుని, సమస్యను పరిష్కారం చేశారు. అనంతరం గడివేముల మండల పరిధిలోని దుర్వేసి గ్రామం లోని సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంపీడీవో విజయసింహారెడ్డి, ఎమ్మార్వో నాగమణి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ  ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందరికీ అందేలా చూడాలని, సచివాలయ సిబ్బంది సరైన సమయపాలనతో పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో గడివేముల డిప్యూటీ తాసిల్దార్ సుధాకర, గడివేముల ఎస్ఐ 𝐵.𝒯. వెంకటసుబ్బయ్య,దుర్వేసి గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: