గురువును  కలిసిన మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్  గా ఉంటారో ఆయన ఫోటోలు  కూడా అంత ఆకర్షించేలా ఉంటాయి. ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించారు. నవ్ సారి ప్రాంతంలోని వాద్ నగర్ వెళ్లిన ఆయన తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన గురువును కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన యోగక్షేమాలను ఆరా తీశారు. మోదీని చూడగానే ఆ గురువులో ఆనందం ఉప్పొంగింది. తన శిష్యుడు ఇవాళ దేశ ప్రధాని అయ్యాడన్న సంతోషం వెల్లివిరిసింది. మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాల్చారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: