పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో విధానపరమైన సంస్కరణలపై...

చర్చను నిర్వహించనున్న రెన్యుఎక్స్‌ ఎక్స్‌పో


(జానో జాగో వెబ్ న్యూస్- బిజినెస్ బ్యూరో)

దేశంలో  సుప్రసిద్ధ బీ2బీ ఎగ్జిబిషన్‌ల నిర్వాహక సంస్థ ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇన్‌ ఇండియా రెండు రోజుల పాటు పునరుత్పాదక విద్యుత్‌ వాణిజ్య ప్రదర్శనను నిర్వహించబోతుంది. ఈ 6వ ఎడిషన్‌ రెన్యుఎక్స్‌ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జూన్‌ 10,11 తేదీలలో జరుగనుంది. దక్షిణ భారతదేశంలో సమగ్రమైన పునరుత్పాదక విద్యుత్‌ కార్యక్రమమిది. రెన్యుఎక్స్‌ 2022 ఎక్స్‌పో, సదస్సులో  వ్యాపార,  విధాన మరియు ఆర్ధిక నిపుణులు పాల్గొనడంతో పాటుగా దేశపు సస్టెయినబల్‌ ఆర్ధికాభివృద్ధి గురించి చర్చించనున్నారు. 2030 నాటికి భారతదేశపు పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యంను 500 గిగావాట్లకు తీసుకువెళ్లాలనే ప్రధానమంత్రి లక్ష్యంకు అనుగుణంగా ఓ అనువైన వాతావరణాన్ని ఈ ఎక్స్‌పో సృష్టించనుంది.


ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్‌, గృహ శాఖలకు సంబంధించి ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శ్రీ  సునీల్‌ శర్మ, ఐఏఎస్‌ ; సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణా లిమిటెడ్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ  శ్రీ జి. రఘురామ రెడ్డి ; టీఎస్‌రెడ్కో వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ శ్రీ ఎన్‌ జానయ్య ; రెసీ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీ అజయ్‌ మిశ్రా, ఐఏఎస్‌ ; కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ బెల్జియం ఇన్‌ ఇండియా కాన్సుల్‌ జనరల్‌ పియర్రీ– ఇమ్మానుయేల్‌ ; బ్రిడ్జ్‌ టు ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వినయ్‌ రస్తోగీ వంటి వారు పాల్గొననున్నారు.  దాదాపు 100 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు. 

రెన్యుఎక్స్‌ ఎక్స్‌పో గురించి ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోగేష్‌  ముద్రాస్‌ మాట్లాడుతూ ‘‘ఆరవ  ఎడిషన్‌ రెన్యుఎక్స్‌ ఎక్స్‌పో వద్ద పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి విధాన పరమైన నిర్ణయాల పట్ల తగు రీతిలో చర్చ జరగనుందని ఆశిస్తున్నాము. భారతదేశపు ప్రతిష్టాత్మక క్లీన్‌ ఎనర్జీ లక్ష్యాలు, ధైర్యవంతమైన విధాన సంస్కరణలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. గత ఎడిషన్స్‌లాగానే ఈ రెన్యుఎక్స్‌ సదస్సు సైతం ఎగ్జిబిషన్‌తో సమాంతరంగా జరుగనుంది’’ అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ ‘‘పరిశ్రమ నివేదికల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలు (కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌)లు 1526 గిగావాట్‌ సౌర విద్యుత్‌ సామర్ధ్యంతో పాటుగా 1124 గిగావాట్ల పవన విద్యుత్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. భారత పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు ఇవి తోడ్పాటునందించనున్నాయి. రెన్యుఎక్స్‌ 2022ను దక్షిణ భారతదేశంలో నిర్వహించడం ద్వారా నూతన క్లీన్‌ ఎనర్జీ సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టేందుకు కొనుగోలుదారులను ప్రోత్సహించనుంది’’ అని అన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: