వారికి మాత్రం ఉచిత డెలవరీ..స్విగ్గీ నిర్ణయం..కానీ షరత్తులు వర్తిస్తాయి


స్విగ్గీ తన కస్టమర్ల కోసం  కొత్త కొత్త అప్షన్లు తీసుకొస్తోంది.  ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. తన స్విగ్గీ వన్ సభ్యుల కోసం ప్రయోజనాల్లో మార్పులు చేసింది. ఇకమీదట యూజర్ ఆర్డర్ చేసిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఏ రెస్టారెంట్ నుంచి అయినా డెలివరీ ఉచితమే. ఇప్పటి వరకు ఎంపిక చేసిన కొన్ని రెస్టారెంట్ల నుంచి మాత్రమే డెలివరీ ఉచితంగా లభించేది. ఇక ఏ రెస్టారెంట్ నుంచి అయినా ఉచిత డెలివరీ సదుపాయం పొందాలంటే ఆర్డర్ విలువ కనీసం రూ.149 ఉండాలి. లేదంటే అప్పుడు సాధారణ యూజర్ల మాదిరే డెలివరీ చార్జీ పడుతుంది. ఇప్పటివరకు ఉచిత డెలివరీ కనీస ఆర్డర్ విలువ రూ.199పైనే లభించింది.  

స్విగ్గీ వన్ సభ్యులు హైపర్ లోకల్ ఇన్ స్టా మార్ట్ సర్వీస్ ద్వారా 10 నిమిషాల్లోనే గ్రోసరీ డెలివరీ సదుపాయాన్ని పొందొచ్చు. ఇన్ స్టా మార్ట్ పై 1,000 పాప్యులర్ ఉత్పత్తులపై స్విగ్గీ వన్ సభ్యులకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఇక స్విగ్గీ జెనీ (కొరియర్ సేవలు) కింద పికప్, డ్రాప్ ఆఫ్ సేవలకు రూ.35 చార్జీపై స్విగ్గీ వన్ సభ్యులకు 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: