యాదవ సంఘం సభ్యుల...

ఆత్మీయ సమ్మేళనం

(జానో జాగో వెబ్ న్యూస్ గడివేముల ప్రతినిధి)

నంద్యాల పార్లమెంటు పరిదిలోని తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న యాదవ సోదరుల ఆత్మీయ సమావేశం నంద్యాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెల సహకార ఫెడరేషన్ చైర్మైన్ వై.నాగేశ్వరరావు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  నంద్యాల పట్టణ సీనియర్ తెలుగుదేశం నాయకురాలు శ్రీమతి విజయగౌరి యాదవ్ గారి గృహంలో జరిగిన ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంటు పరిదిలోని అన్ని నియోజకవర్గాల యాదవ ముఖ్యనేతలు పాల్గొన్నారు.


భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి యాదవ సామాజికవర్గం నుండి పెద్దఎత్తున సహకారాన్ని అందించేందుకు సమాయత్తం కావాలనే లక్ష్యంతో ముందుకు కదలాలని నాగేశ్వరరావు యాదవ్ గారు పిలుపునిచ్చారు. త్వరలోనే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు రూపొందించి కార్యచరణ ప్రణాలికను అమలు చేయాలని పేర్కొన్నారు.


 పాణ్యం నియోజకవర్గం నుండి జిల్లా యాదవసంఘం అద్యక్షులు దుర్వేసి క్రిష్ణ యాదవ్, బనగానపల్లె నుండి పాండురంగయాదవ్, ఆళ్లగడ్డ నుండి బంగారు రాముయాదవ్, బేతంచెర్ల మండలం అంబాపురం సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, బనగానపల్లె పట్టణ నాయకులు పవన్ యాదవ్, దుర్వేసి శ్రీనివాస్ యాదవ్ సోదరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: