అధికార్లపై  కేంద్ర సహాయ మంత్రి ఆగ్రహం


ఆయుష్మాన్ భారత్ పథకం కోసం కేంద్రం పీఎం కేర్స్ ద్వారా నిధులు అందిస్తోందన్న విషయం మీకు  తెలుసా అని అధికార్లను దే విషయమై మంత్రి ప్రశ్నించారు. నిలదీసినంత పనిచేశారు. ఈ పథకానికి నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయన్న విషయం తెలుసా అని అధికారులను ప్రశ్నించారు. ఓ ఆరోగ్యశ్రీ కార్డును చూపుతూ దీనిపై ప్రధాని ఫొటో ఏది అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అక్కడే ఉండగా, ఆయనను కూడా ఇదే విషయమై మంత్రి ప్రశ్నించారు.

కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ నేడు ఏపీ విచ్చేశారు. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవలను సమన్వయపరిచే ఆరోగ్యమిత్ర కేంద్రాన్ని పరిశీలించారు. అయితే, ఆరోగ్యశ్రీ కార్డులపై కేవలం ఏపీ సీఎం జగన్ ఫొటో ఒక్కటే ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై ఆమె విస్మయం చెందారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: