లియోఫైలైజ్డ్‌ యాంటీబయాటిక్స్‌ యాంటీ ఫంగల్‌ మార్కెట్‌ లో...

వాటాను సొంతం చేసుకునేందుకు దృష్టి సారించిన గుఫిక్‌ బయోసైన్సెస్‌

(జానో జాగో వెబ్ న్యూస్- బిజినెస్ ప్రతినిధి)

తమ వినూత్నమైన, అత్యధిక నాణ్యత కలిగిన ఫార్మాస్యూటికల్‌, హెర్బల్‌ ఉత్పత్తుల ద్వారా గుర్తింపు పొందడంతో పాటుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫార్మాస్యూటికల్‌ సంస్ధ గుఫిక్‌ బయోసైన్సెస్‌ లిమిటెడ్‌ ఇప్పుడు 3వేల కోట్ల రూపాయల లయోఫైలైజ్డ్‌ యాంటీ బయాటిక్స్‌, యాంటీ ఫంగల్‌ మార్కెట్‌లో ఆధిపత్య వాటాను కైవసం చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకుంది. విస్తృత శ్రేణి ఏపీఐలతో పాటుగా అత్యున్నత  నాణ్యత కలిగిన ఫార్మాస్యూటికల్‌, హెర్బల్‌ ఉత్పత్తులకు సుప్రసిద్ధమైన  గుఫిక్‌ బయోసైన్సెస్‌ నూతన డ్రగ్‌ డెలివరీ వ్యవస్ధ ః డ్యూయల్‌ ఛాంబర్‌ బ్యాగ్స్‌ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా అందుబాటు ధరలలో అందించనుంది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమం  శ్రీ ప్రణవ్‌ చోక్సీ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, గుఫిక్‌ బయోసైన్సెస్‌ లిమిటెడ్‌ ; డాక్టర్‌ అష్ఫక్‌ హసన్‌, హెచ్‌ఓడీ, డిపార్ట్‌ఆఫ్‌ పల్మో, ఓవైసీ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ; డాక్టర్‌ జెఎం ఘన్‌శ్యామ్‌, క్రిటికల్‌ కేర్‌ డిపార్ట్‌మెంట్‌ , మెడికవర్‌ గ్రూప్‌ మరియు డాక్టర్‌ సతీష్‌ టీ, హెచ్‌ఓడీ,క్రిటికల్‌ కేర్‌, అపోలో  సమక్షంలో జరిగింది.


భారతప్రభుత్వ ప్రతిష్టాత్మక మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి అసాధారణంగా తోడ్పాటునందిస్తున్న గుఫిక్‌ బయోసైన్సెస్‌ ఇప్పుడు తమ ఫ్రెంచ్‌ సహచర సంస్థతో భాగస్వామ్యం చేసుకుని ఈ నూతన సాంకేతికత దేశీయంగా భారతదేశంలో అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకూ ఈ డ్యూయల్‌ ఛాంబర్‌  బ్యాగ్స్‌ను అధిక శాతంలో  దిగుమతి చేసుకోవడంతో పాటుగా రోగులకు ధర పరంగా భారంగానూ నిలిచింది. దీనికి విరుద్ధంగా గుఫిక్‌ బయోసైన్సెస్‌ కేవలం అత్యున్నత నాణ్యత  కలిగిన  డ్యూయల్‌ ఛాంబర్‌ బ్యాగ్స్‌ను అందుబాటు ధరలో అందిస్తుంది. ఈ నూతన డ్రగ్‌ డెలివరీ సిస్టమ్‌ ఉత్పత్తులు అత్యధిక కాలం నిల్వ కూడా ఉంటాయి.

గుఫిక్‌ బయోసైన్సెస్‌ లిమిటెడ్‌ సీఓఓ, డాక్టర్‌ దేబేష్‌దాస్‌ మాట్లాడుతూ ‘‘దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మరీ ముఖ్యంగా క్రిటికల్‌ వేర్‌ విభాగంలో  ఈ దిగుమతులను మరింతగా తగ్గించాలనుకుంటున్నాము.  ఈ లక్ష్యంతోనే మేము  దేశీయంగా ఉత్పత్తి చేసిన డ్యూయల్‌ ఛాంబర్‌ బ్యాగ్స్‌ను అంతర్జాతీ ప్రమాణాలతో భారతదేశంలో అత్యంత అందుబాటు ధరలలో తీసుకువచ్చాము. మా ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్‌ను మేము చూస్తున్నాము. ఈ నిర్థిష్టమైన విభాగంలో భారీ మార్కెట్‌ వాటాను సొంతం చేసుకునేందుకు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని  అన్నారు.

గుఫిక్‌ బయోసైన్సెస్‌ విడుదల చేసిన ఈ డ్యూయల్‌ ఛాంబర్‌ బ్యాగ్స్‌ 2 –ఛాంబర్‌ 4 బ్యాగ్స్‌. వీటిని పాలీప్రోప్లీన్‌ (డీఈహెచ్‌పీ ఫ్రీ)తో తొలగించతగిన అల్యూమినియం ఫాయిల్‌తో  తీర్చిదిద్దారు. తద్వారా అస్థిర ఔషదాలను సైతం నిల్వచేయడం సాధ్యమవుతుంది. రోగికి వాడే ముందు దీనిని పునర్నిర్మిస్తే సరిపోతుంది.  ఈ పీలబల్‌ సీల్‌ లియోఫైలైజ్డ్‌ (లేదా పౌడర్‌) ఔషదాన్ని మరియు దీని డైల్యూయెంట్‌ను వేరు చేస్తుంది. అంతేకాదు, ఈ ఉత్పత్తి యుఎస్‌ మరియు ఈయు ఫార్మకోపియాస్‌ను కలిగి ఉంటుంది. దీనిని ఐఎస్‌ఓ 7 క్లీన్‌ రూమ్‌ కింద సీజీఎంపీలో తయారుచేస్తారు.

గుఫిక్‌ బయోసైన్సెస్‌  తీర్చిదిద్దిన డ్యూయల్‌ ఛాంబర్‌ బ్యాగ్స్‌ (డీసీబీ) ప్రయోజనాలు, ఆకర్షణలు ః

రక్తప్రవాహంలో ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా రోగికి మెరుగైన భద్రతను సైతం అందిస్తుంది.

వయెల్స్‌తో పోలిస్తే డీసీబీలో  ఔషదపు స్థిరత్వం మరింత అధికంగా ఉంటుంది. ఇది కాంతి, తేమల నుంచి సంపూర్ణ రక్షణను అందిస్తుంది.

ఈ బ్యాగ్‌ యొక్క క్లోజ్డ్‌  వ్యవస్ధ లోపలి ఉత్పత్తి స్టెరైల్‌ చేయబడుతుందనే భరోసా కల్పించడంతో పాటుగా హ్యాండ్లింగ్‌ సమయంలో కలుషితమయ్యే ప్రమాదాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుంది.

ఎలాంటి నైటోసమైన్స్‌ వినియోగించలేదు. విభిన్నమైన అవయవాలు, కణజాలాలలో ఎలాంటి క్యాన్సర్‌ ప్రమాదమూ లేదు.

ట్యూబింగ్‌, డీసీబీ, ట్విస్ట్‌ ఆఫ్‌ పోర్ట్‌లు డీఈహెచ్‌పీ ఫ్రీ కావడం చేత ఎలాంటి క్యాన్సర్‌ ప్రమాదం లేదు. అలాగు పుట్టుక లోపాలు , ఇతర  పునరుత్పత్తి సమస్యలు కూడా ఉండవు.

డ్రగ్‌ ప్రొడక్ట్‌తో ఇంటరాక్షన్‌ ప్రమాదాన్ని  గ్లూ ఫ్రీ  తొలగిస్తుంది.

2 ప్రత్యేక సంచులలో ఉద్దేశించిన మోతాదుతో ముందుగా పూరించబడుతుంది మరియు ఖచ్చితమైన డోసింగ్‌, సులభమైన నిర్వహణ, సీల్‌ సమగ్రత, అధిక స్థిరత్వం ఉంటాయి. 

వ్యక్తిగత చికిత్స నియమాలు– ఆసుపత్రిలో కాలుష్యాన్ని నివారిస్తుంది మరియు అత్యధిక స్థిరత్వం, సౌకర్యం అందిస్తుంది. తద్వారా ఉత్పత్తి నాణ్యత, రోగి సమ్మతి గణనీయంగా మెరుగుపడుతుంది.

అధిక స్థిరత్వాన్ని అందిస్తుంది. గాలి ద్వారా బ్యాక్టీరియా  కలుషితం కావడం నివారించడంతో పాటుగా సూది గుచ్చుకోవడం ద్వారా ప్రమాదబారిన పడకుండా కాపాడుతుంది.

గుఫిక్‌ బయోసైన్స్‌స్‌ తీర్చిదిద్దిన, ఈ వినియోగించడానికి సిద్ధంగా ఉన్న డ్యూయల్‌ చాంబర్‌ బ్యాగ్స్‌  యొక్క ప్రధాన యుఎస్‌పీలలో  అత్యంత కీలకమైనది ఇవి కలుషితం కాకుండా నివారించడంతో పాటుగా ఔషదపు సామర్థ్యం, శక్తిని రక్షిస్తుంది. పునర్నిర్మాణ  సమయంలో  ఈ బ్యాగ్‌ల నిర్వహణ అత్యంత సులభం. అంతేకాదు,డైలూష్యన్‌ ఎర్రర్స్‌ నివారించడంలోనూ సహాయపడుతుంది. ఎందుకంటే, వినియోగించే డైల్యూమెంట్‌కు తగిన మోతాదులో మాత్రమే ఈ ఔషదం  ఉంటుంది. దీనిని వినియోగించే ముందు మాత్రమే అల్యూమినియం ఫాయిల్‌ను తొలగించడంతో పాటుగా బ్యాగ్‌ను మడతపెట్టి, స్క్వీజింగ్‌ చేస్తే సరిపోతుంది. తద్వారా  డైల్యూయెంట్‌ డ్రగ్‌ చాంబర్‌లోనికి ప్రవేశించి డ్రగ్‌తో కలుస్తుంది. ఆ తరువాత నేరుగా ఇది  ఐవీ ఇన్ఫ్యూజన్‌ ద్వారా రోగికి ఐవీ ట్యూబ్స్‌ సహాయంతో అందిస్తారు.

భారతదేశంలో లియోఫైలైజ్డ్‌ ఇంజెక్షన్స్‌  తయారీ సంస్థలలో అతిపెద్ద సంస్ధలలో ఒకటిగా గుర్తించబడిన గుఫిక్‌ బయోసైన్సెస్‌కు పూర్తిగా ఆలోమేట్‌ చేయబడిన లియోఫైలైజేషన్‌ ప్లాంట్‌ కలిగి ఉంది. ఈ కంపెనీ యొక్క లియోఫైలైజ్డ్‌  ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో యాంటీబయాటిక్‌, యాంటీ ఫంగల్‌, కార్డియాక్‌, ఇన్‌ఫెర్టిలిటీ, యాంటీవైరల్‌ , ప్రోటాప్‌ పంప్‌ ఇన్హిబిటర్‌ విభాగాలు వంటివి ఉన్నాయి. దీని ఉత్పత్తులు అన్ని ప్రధాన హాస్పిటల్‌ చైన్స్‌, సుప్రసిద్ధ వైద్య సదుపాయాలలో అందుబాటులో ఉంటాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: