తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్,,

నూతన చైర్మన్ గా బుచ్చిదాస్ గౌడ్


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణరాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన చైర్మన్ గా  పాతబస్తీకి చెందిన   బొంగు  బుచ్చిదాస్ గౌడ్ ఎన్నిక య్యారు. లాల్‌ బహదూర్ స్టేడియం లోని ఒలింపిక్స్ భవన్ లో  జరిగిన తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జీ.శంకర్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా  కె సుజితకుమార్  వర్కింగ్ ప్రెసిడెంట్  గా కె.రమేశ్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఎం. నాగరాజు, వి. మల్లేశ్ యాదవ్, ఆనంద్ రాజ్, కోశాధికారిగా కె.దయానంద్ రెడ్డిని ఎన్నుకున్నారు.


ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా ఎంపికైన బొంగు బుచ్చిదాసు గౌడ్ మాట్లాడుతూ  ఔత్సాహిక యువకులకు దేహదారుఢ్యాన్ని పెంచేందుకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు  .తెలంగాణా యువకులు రానున్న రోజుల్లో  జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందడానికి పవర్ లిప్టింగ్ అసోసియేషన్ యువతకు ‍అవసరమైన కృషి  చేస్తుందని  హామీ ఇచ్చారు.  జిల్లా స్థాయిల్లో క్రీడా పాఠశాలలు నెలకొల్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు  .క్రీడా ప్రాంగణాల్లో విద్యార్థులకు యువత ఆయా అంశాల్లో శిక్షణ పొందడానికి అవసరమైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు  ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కోచ్ లను నియమించాలని కోరారు  .

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: