భారతీయ వ్యాపార సమాజంతో కార్బన్‌ న్యూట్రల్‌ ఆర్థిక వ్యవస్ధ కోసం...

అతిపెద్ద వేదికగా నిలువనున్న రెన్యుఎక్స్‌ 2022

(జానో జాగో వెబ్ న్యూస్-బిజినెస్ బ్యూరో)

ఇతర విద్యుత్‌ వనరులపై ఆధారపడటం తగ్గించి,పునరుత్పాదక విద్యుత్‌ వైపు వేగవంతంగా మళ్లేందుకు ఉన్న అవకాశాలను ఇండియా అన్వేషిస్తోన్న వేళ  సమగ్రమైన పునరుత్పాదక విద్యుత్‌ కార్యక్రమం  రెన్యుఎక్స్‌ 2022  ఆరవ ఎడిషన్‌ నేడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వద్ద ప్రారంభమైంది. ఇండియా తమ విద్యుత్‌ అవసరాలలో సగం అంటే సుమారు 500 గిగావాట్‌ విద్యుత్‌ను 2030 నాటికి పునరుత్పాదక విద్యుత్‌ వనరుల ద్వారా సొంతం చేసుకోవడానికి లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా 2070 నాటికి ఉద్గారాల విడుదల పరంగా నెట్‌ జీరో చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ‘అన్‌లాకింగ్‌ ద ఎరా టు నెట్‌ జీరో ఎమిషన్స్‌’  నేపథ్యంతో నిర్వహిస్తోన్న ఈ షో ద్వారా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకతను తెలుపుతూనే  సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ దిశగా వాటాదారులు పయణించాల్సిన ఆవశ్యకతనూ తెలుపుతుంది.

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్‌, గృహ శాఖలకు సంబంధించి ప్రభుత్వ చీఫ్ స్పెషల్‌  సెక్రటరీ   సునీల్‌ శర్మ, ఐఏఎస్‌ ;  తెలంగాణా స్టేట్‌ రెన్యువబల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌రెడ్కో) వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌ జానయ్య ; రెసీ డైరెక్టర్‌ జనరల్‌  మరియు (పూర్వ) ప్రత్యేక ముఖ్య కార్యదర్శి –తెలంగాణా ప్రభుత్వం అజయ్‌ మిశ్రా, ఐఏఎస్‌ ;  కాన్సుల్‌ జనరల్‌ ఆఫ్‌ కింగ్‌డమ్‌ ఆఫ్‌ బెల్జియం ఇన్‌ ఇండియా కాన్సుల్‌ జనరల్‌ బ్రసెల్‌మన్స్‌ పియర్రీ– ఇమ్మానుయేల్‌ ; బ్రిడ్జ్‌ టు ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వినయ్‌ రస్తోగీ వంటి వారు పాల్గొన్నారు.  


తెలంగాణా రాష్ట్రం ఈ ఎక్స్‌పోకు పార్టనర్‌ స్టేట్‌గా వ్యవహరిస్తుండగా100 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. వీరిలో వారీ ఎనర్జీస్‌, గోల్డీ సోలార్‌ , జింకో సోలార్‌, ప్రీమియర్‌ ఎనర్జీస్‌ , జాక్సన్‌ గ్రూప్‌, రేజాన్‌ సోలార్‌ , అదానీ సోలార్‌ , ఎవర్‌వోల్ట్‌, ఎన్‌పాజిబిలిటీస్‌,రెడింగ్టన్‌, టార్చ్‌ ఎనర్జీ,  డీఎన్‌వీ, ఇంపల్స్‌ గ్రీన్‌, ఐకాన్‌ సోలార్‌ , రేడీన్‌ ఇండస్ట్రీ, ఇన్వెర్జీ, సన్‌బౌండ్‌ ఎనర్జీ వంటివి ఉన్నాయి. ఈ ఎక్స్‌పోలో  విస్తృత శ్రేణిలో అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతికతలను విభిన్న విభాగాలైనటువంటి  పీవీ మాడ్యుల్స్‌, హైబ్రిడ్‌ సిస్టమ్స్‌, మెటీరియల్స్‌, యంత్ర సామాగ్రి, ఇన్వర్టర్లు, చార్జ్‌ కంట్రోలర్స్‌, బ్యాటరీస్‌, టెస్టింగ్‌ మరియు మానటరింగ్‌ వ్యవస్థలు, కంపోనెంట్‌ తయారీ సంస్ధలు, బయో ఎనర్జీ ఎక్విప్‌మెంట్‌ తయారీ సంస్ధలు, బ్యాక్‌ షీట్‌ తయారీసంస్థలు మరియు  సిస్టమ్‌ ఇంటిగ్రేటర్లు ప్రదర్శిస్తున్నారు.

మరోమారు పునరుత్పాదక విద్యుత్‌ సృష్టిలో దక్షిణ భారతదేశం లీడర్‌షిప్‌ స్ధానంలో నిలిచేందుకు దక్షిణ భారతదేశం సర్వం సిద్ధమైంది. మంత్రులు, ప్రభుత్వ శాఖల నుంచి లభిస్తోన్న అసాధారణ మద్దతుతో పాటుగా పరిశ్రమలో అత్యున్నత అసోసియేషన్లు అయినటువంటి ఇండో–జర్మన్‌ ఎనర్జీ ఫోరమ్‌, నేచురల్‌ సోలార్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ; బ్రిడ్జ్‌ టు ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ; ఇండియన్‌ గ్యాస్‌ అసోసియేషన్‌ మరియు మరెన్నో ఈ మార్పును వేగవంతం చేయడంతో పాటుగా మరింత స్థిరమైన మరియు సస్టెయినబల్‌ ఆర్ధిక వ్యవస్ధ దిశగా తీసుకువెళ్తున్నాయి. అదే  సమయంలో పెట్టుబడులు, ఉపాధి మరియు దిగుమతులను భర్తీ చేసే అవకాశాలనూ అందిస్తుంది. 

ఈ ప్రదర్శనలో భాగంగా సదస్సులు కూడా జరుగనున్నాయి. వీటిలో  చర్చా కార్యక్రమాలు, ప్రెజంటేషన్లను  పాలసీ రెగ్యులేషన్స్‌ నీడ్‌ ఆఫ్‌ ద హవర్‌ ఫర్‌ ఇండియా ఫర్‌ ఎఫెక్టివ్‌ సర్క్యులర్‌ ఎకనమీ ఇన్‌ సోలార్‌ ఎనర్జీ (సౌర విద్యుత్‌ లో ప్రభావవంతమైన వృత్తాకార ఆర్ధిక వ్యవస్థ కోసం భారతదేశానికి విధానపరమైన నియంత్రణల ఆవశ్యకత) ; పునరుత్పాదక విద్యుత్‌ దిశగా ఆవిష్కరణలు మరియు సాంకేతికతలు  (ఇన్నోవేషన్స్‌ అండ్‌ టెక్నాలజీ ద వే ఫార్వాడ్‌ టు ఆర్‌ఈ) ; గ్రీన్‌ హైడ్రోజన్‌ – గ్రీన్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశపు మార్గం ! (గ్రీన్‌ హైడ్రోజన్‌ – ఇండియాస్‌ పాత్‌వే టు గ్రీన్‌ ఎకనమీ !),  విద్యుత్‌ సంక్షోభం – పునరుత్పాదకాల ద్వారా గరిష్ట డిమాండ్‌ను తీర్చడం (పవర్‌ క్రైసిస్‌– అడ్రసింగ్‌ పీక్‌ డిమాండ్‌ త్రూ రెన్యువబల్స్‌) ; పునరుత్పాదక విద్యుత్‌ శక్తిని పొందినప్పుడు మాత్రమే ఈ–హైవేలు ఆర్ధికంగా మరియు ఆకుపచ్చగా ఉంటాయి (ఈ–హైవేలు ఆర్‌ ఎకనమిక్‌ అండ్‌ గ్రీన్‌ ఓన్లీ వెన్‌ పవర్డ్‌ బై ఆర్‌ఈ) ; భారతదేశంలో  అగ్రిపీవీ కోసం వ్యాపార అవకాశాలు (బిజినెస్‌ ఆపర్ట్యునిటీస్‌ ఫర్‌  అగ్రి పీవీ ఇన్‌ ఇండియా) మరియు బయో ఎనర్జీ – అభివృద్ధి చెందుతున్న భారతదేశపు విద్యుత్‌ మార్కెట్‌కు తప్పనిసరి !(బయో ఎనర్జీ– ఏ మస్ట్‌ ఫర్‌ ద ఎమర్జింగ్‌ ఇండియా ఎనర్జీ మార్కెట్‌ !) వంటి అంశాలు ఉన్నాయి.

పునరుత్పాదక విద్యుత్‌   రంగానికి  ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత ఈ ఎక్స్‌పోలో  ప్రస్ఫుటంగా వెల్లడిస్తూ  ఆల్‌   సీఈఓ కాంక్లేవ్‌  ఉంటుంది. ఇది 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ శక్తిని చేరుకోవడానికి రోడ్‌మ్యాప్‌ను నిర్వహించడానికి వాటాదారుల కోసం మధ్యస్థ– దీర్ఘకాల బ్లూ ప్రింట్‌ను రూపొందించింది. ఈ 90 నిమిషాల క్లోజ్డ్‌ డోర్‌ ఫార్మెట్‌ సదస్సుకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్‌ శర్మ, ఐఏఎస్‌ నేతృత్వం వహించనుండగా,  20–25 మంది సీఈఓలు పాల్గొననున్నారు. వారు ఆర్‌ ఈ డొమైన్‌లో భారతీయ వ్యవస్థాపక ల్యాండ్‌స్కేప్‌ను మెరుగుపరచడానికి మరియు దక్షిణాది రాష్ట్రాలలో  ఈవీకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని పెంచడానికి విధాన రూపకర్తలు చేస్తున్న ప్రయత్నాల విషయాలపై వారు లోతుగా చర్చించారు.

రెండవ రోజు, ఈ షోలో భాగంగా ఇదే ప్రాంగణం వద్ద రెన్యూ ఎక్స్‌ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ అవార్డులు మరింతగా పరిశ్రమలోని సంస్ధలకు తగిన  మద్దతు, ప్రోత్పాహం అందించడంతో పాటుగాదక్షిణ భారతదేశంలో తగిన ప్రభావాన్నీ చూపనున్నాయి. మరీ ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు, కార్యక్రమాలతో  మార్పు తీసుకువచ్చిన వారికి ఇవి ప్రోత్సాహమందించనున్నాయి. సుప్రసిద్ధ నిపుణులతో కూడిన న్యాయనిర్ణేతల బృందం 60 నామినేషన్ల నుంచి పరిశ్రమ నిపుణులను ఎంపిక చేసి ఈ అవార్డులను అందజేస్తున్నాయి. ఈ అవార్డులను ఈవీని ప్రాసెస్‌ ఎడ్వైజర్లుగా తీసుకుని పద్ధతిగా నిర్వహిస్తున్నారు.

రెన్యుఎక్స్‌ ఎక్స్‌పో గురించి ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ యోగేష్‌  ముద్రాస్‌ మాట్లాడుతూ ‘‘రెన్యు ఎక్స్‌ మరోమారు తమ 6వ ఎడిషన్‌ ప్రదర్శన ద్వారా భారతదేశపు కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి మద్దతునందిస్తూనే క్లీన్‌ ఎనర్జీ దిశగా వెళ్లేందుకు సైతం తోడ్పడుతుంది. తమ విద్యుత్‌ అవసరాలను తమంతట తాముగా చేరుకోవాలని ఇండియా భావిస్తోన్న వేళ, అంటే 2040నాటికి 15, 820టీడబ్ల్యుహెచ్‌ చేరుకుంటుందని  అంచనా వేస్తోన్న వేళ, పునరుత్పాదక విద్యుత్‌ అతి ముఖ్యమైన పాత్ర పోషించనుంది. బొగ్గుకు బదులుగా  పునరుత్పాదక  వనరులు  వినియోగించిన ఎడల ప్రతి సంవత్సరం ఇండియాకు 54వేల కోట్ల రూపాయలు (8.43 బిలియన్‌ డాలర్లు) ఆదా అవుతాయి. ఈ ప్రదర్శన మరియు సదస్సు తో రెన్యు ఎక్స్‌ 2022  ఇప్పుడు పునరుత్పాదక విద్యుత్‌ వాటాదారులకు తగిన ప్రోత్సాహం అందించడంతో పాటుగా తాజా సాంకేతికతలు, ధోరణులను స్వీకరించేందుకు, 2050 నాటికి కార్బన్‌ న్యూట్రాలిటీ ఆర్థిక వ్యవస్థను చేరుకునేందుకు తోడ్పడుతుంది’’ అని అన్నారు.

‘‘పవన విద్యుత్‌ కోసం పొడవైన  తీర ప్రాంతాలు ఉండటం, సోలార్‌ కోసం తగినంతగా  వికరణం ఉండటం చేత దక్షిణాది రాష్ట్రాలు (కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌) అన్నీ కూడా పునరుత్పాదక విద్యుత్‌  పరిశ్రమకు  రెన్యు ఎక్స్‌ ద్వారా భారీ స్థాయిలో మద్దతునందిస్తున్నాయి మరియు ఆకర్షణీయమైన వ్యాపార కేంద్రంగానూ మారుస్తున్నాయి. సీఈఓ కాంక్లేవ్‌ మరియు రెన్యుఎక్స్‌ అవార్డులు లాంటి కార్యక్రమాలు మరింతగా కొనుగోలుదారులు నూతన క్లీన్‌ ఎనర్జీ సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టేందుకు, విప్లవాత్మక ఆవిష్కరణలతో పునరుత్పాదక విద్యుత్‌ డొమైన్‌లో మార్పు తీసుకువచ్చేందుకు భారతదేశానికి సహాయపడటంతో పాటుగా తమ పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను చేరుకునేందుకు భారతదేశానికి  సహాయపడనుంది’’ అని ఆయన అన్నారు.

భారీ స్థాయిలో మార్పు తీసుకురాల క్లీన్‌ ఎనర్జీ పాలసీలు ప్రారంభించడం మరియు గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా పాలసీలు సహా సంస్కరణలు, సోలార్‌ మాడ్యుల్‌లో   ఉత్పత్తి అనుసంధానిత  ప్రోత్సాహక పథకాలు, బ్యాటరీ తయారీ, మార్కెట్‌ ఆధారిత ఆర్ధిక డిశ్పాచ్‌, జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌, గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌  పథకాలు, పంపిణీ, ఉత్పత్తి మరియు సరఫరా పరంగా రాష్ట్ర  ఆస్తులను ప్రైవేటీకరించడం వంటివి క్లీన్‌ ఎనర్జీ అవసరాలకు తోడ్పడనున్నాయి. లోకలైజేషన్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం స్థానికీకరణ అవసరాలు తీర్చడంతో పాటుగా దేశపు గ్రీన్‌ ఎనర్జీ లక్ష్యాలకు సైతం ప్రతిబింబంగా  రెన్యుఎక్స్‌ నిలుస్తుంది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: