తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదు: బండి సంజయ్


తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదంటూ కేటీఆర్ పంపిన నోటీసుపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌పైనా, త‌న‌పైనా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేస్తానంటూ లీగ‌ల్ నోటీసులు పంపిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ నోటీసుల‌పై తాజాగా బండి సంజ‌య్ ఘాటుగా స్పందించారు. తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డేది లేదంటూ బండి సంజ‌య్ పేర్కొన్నారు. 

మంత్రి కేటీఆర్ వ‌ల్ల 27 మంది ఇంట‌ర్ విద్యార్థులు చ‌నిపోయారంటూ బండి సంజ‌య్ చేసిన ట్వీట్ ఆధారంగానే ఆయ‌న‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు పంపిన సంగ‌తి తెలిసిందే. విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లపై ద‌మ్ముంటే సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డాల‌ని బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. సీబీఐ విచార‌ణ జ‌రిగితే విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌కులెవ‌రో తెలుస్తుంది క‌దా? అని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాగే హామీలిచ్చి మోసం చేస్తున్న మీపై 420 కేసులు న‌మోదు చేయాలంటూ సంజయ్ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: