నంద్యాల సబ్ కలెక్టర్...ఆకస్మిక తనిఖీ

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలం లోని సచివాలయం 1 మరియు తహసిల్దార్  కార్యాలయాన్ని నంద్యాల జిల్లా సబ్ కలెక్టర్ శ్రీనివాసులు గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా  సచివాలయం 1 లో  సిబ్బంది ఎంతమంది ఉన్నారు, సిబ్బంది సరైన వేళకు వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కాల పరిమితి ఎంతవరకు ఉన్నాయో లబ్ధిదారులకు తెలియజేస్తున్నారా లేదని సచివాలయ సిబ్బంది నీ అడిగి తెలుసుకున్నారు లబ్ధిదారులకు ఎవరికైనా పథకాలు గురించి తెలియక పోతే వారికి తెలియజేయాలని  సూచించారు.అనంతరం గడివేముల తహసిల్దార్ కార్యాలయం  ను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నూతనంగా  నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత వెబ్ సైట్ ప్రారంభం కాలేదని ఈరోజు నుండి వెబ్ సైట్  ప్రారంభమైందని తెలిపారు అనంతరం తహసిల్దార్ నాగమణి గారితొ  మాట్లాడుతూ స్పందన కార్యక్రమాలలో ప్రజల వద్ద నుండి ఎన్ని అర్జీలు వచ్చాయని, వాటిలో ఎంతమంది ప్రజల అర్జీలు పరిష్కారాలు చేశారని, పరిష్కరించని అర్జీలు ఏ ఏ కారణాల వల్ల పరిష్కారం కాలేదని , ఏదైనా సమస్య ఉంటే వాటిని త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నాగమణి, డిప్యూటీ తహసిల్దార్  సుభాకర్, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: