పవన్ కు, కేఏ పాల్ కు పెద్ద తేడా లేదు: నందిగం సురేశ్


పవన్ కు, కేఏ పాల్ కు పెద్ద తేడా లేదు అని జనసేనాని పై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మరోసారి సెటైర్లు వేశారు. ఇంకా చెప్పాలంటే పవన్ కంటే కేఏ పాలే ఎక్కువ మేధావి అని అన్నారు. కేఏ పాల్ మేధస్సే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రజలు ఏమైపోయినా పవన్ కు అనవసరమని... టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే పవన్ బయటకు వస్తారని విమర్శించారు. 

జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని... ప్రజలు ఆనందంగా ఉండటాన్ని చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. పేద వాళ్లందరూ ఎదగాలని జగన్ పని చేస్తుంటే... తన బినామీలు బాగుంటే చాలని చంద్రబాబు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నారా లోకేశ్ వి పిల్ల చేష్టలని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: