రవాణా శాఖ మంత్రి పువ్వాడ కు,,,

వినతిపత్రం అందజేసిన యంపిజె బృందం


(జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

తెలంగాణ ప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్స్ మరియు పోలీస్ రిక్రూట్మెంట్ (ఎస్.ఐ- కానిస్టేబుల్)లలో ఉచిత శిక్షణ ఇస్తున్నందుకు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అధ్యక్షులు షేక్. ఖాసిమ్ రవాణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి., బి.సి., అభ్యర్థులకు ఉపకారవేతనం ఇస్తున్న విధంగానే మైనారిటీ అభ్యర్థులకు కూడా ఉపకారవేతనం   ఇవ్వాలని కోరుతూ మంత్రి అజయ్ కుమార్ కు యం.పి.జె సభ్యులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మగ్బూల్, మాజీ కార్పోరేటర్ షౌకత్ అలీ, యం.పి.జె., కోశాధికారి ఎమ్.డి. హకీమ్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: