దిశ యాప్ పై ప్రజలకు...అవగాహన


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా, గడివేముల మండల పరిధిలోని ప్రజలకు దిశ యాప్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గడివేముల ఎస్ఐ హుస్సేన్ బాషా మాట్లాడుతూ దిశ చట్టం అనేది ప్రతి మహిళ సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ యాప్ ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన, వేధింపులకు గురి చేసిన, ప్రజలు ఎలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దిశ యాప్ ద్వారా ఫోన్ చేసి  సమాచారాన్ని తెలియజేస్తే తక్షణమే పోలీసు శాఖ అధికారులు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన తెలిపారు.


ఈ దిశ యాప్ ను అత్యవసర పరిస్థితులలో మాత్రమే  ఉపయోగించాలని, అనవసరంగా దిశ యాప్ ఉపయోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గడివేముల ఎస్.ఐ. హుస్సేన్్ బాషా తెలిపారు. ఈ దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో గడివేముల  పోలీస్ సిబ్బంది,మహిళా పోలీసులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: