ప్రజలు  తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించే  స్వేచ్ఛ ఉంది

ఐ.ఎం.అహ్మద్ స్పష్టీకరణ

(జానో జాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని మతాలు సమానమేనని, ఏమతమూ ఇతర మతంపై ప్రాధాన్యత కలిగి లేదని ప్రజలు  తన ఇష్టానుసారం మతాన్ని అవలంబించే  స్వేచ్ఛ కల్పించబడిందని సొసైటీ ఆఫ్ ఇంటలెక్చువల్స్ వాయిస్, విశాఖపట్నం అధ్యక్షుడు,ప్రముఖ న్యాయవాది ఐఎం అహ్మద్ అన్నారు. విశాఖలో ప్రముఖ వ్యక్తిత్వ నిపుణుడు సిరాజ్ ఆధ్వర్యంలో  ప్రాధమిక హక్కులు, మతస్వేచ్ఛ, ప్రజాప్రయోజన వాజ్యాలపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సును  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎం అహ్మద్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ప్రాధమిక హక్కులని పేర్కొన్నారు.ప్రాధమిక హక్కులకు ఎవ్వరూ భంగం కల్పించినా నేరమేనన్నారు.సదస్సులో రాష్ట్రం నలు మూలల నుండి  హాజరైన దాదాపు రెండువందల మందికి ఇండియన్ పీనల్ కోడ్ పై అవగాహన కల్పించి రాజ్యాగం కల్పించిన హక్కులు అందరికీ సమానమేనని తెలిపారు.


నిర్వాహకులు  సిరాజ్ వ్యక్తిత్వ వికాసం,బహిరంగ ప్రసంగాలు,నైతిక విలువలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఐఎం అహ్మద్  చేస్తున్న  న్యాయపోరాటాలు,ఆహార కల్తీ,పండ్లలో  రసాయనాలు కలపడం,కాలుష్యం  పై  న్యాయ పోరాటాలను బ్రదర్  సిరాజ్  ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మౌలానా ముతీవర్ రెహ్మాన్,అబ్దుల్ షేక్,ఇబ్రహీం, యాసీన్,ఖాన్ తదితరులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: