ఢిల్లీలో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం


దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు గురువారం శాస్త్ర‌బ‌ద్ధంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఢిల్లీలోని వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఉత్స‌వాల‌ను టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న శాస్త్ర‌బద్ధంగా ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ పూజ చేశారు.

గురువారం నుంచి ఈ నెల 22 దాకా ఉత్స‌వాలు కొనసాగ‌నున్న‌ట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో మాదిరే ఢిల్లీలోనూ శాస్త్ర‌బ‌ద్ధంగా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఉత్స‌వాల ప్రారంభోత్స‌వంలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి, టీటీడీ స‌ల‌హా మండ‌లి చైర్మ‌న్ ప్ర‌శాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: