"పెన్సిల్ పరిశ్రమ" తో ప్రగతిపథంలో పయనిస్తూ

వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతూ

అభినందలందుకుంటున్న....రాజమహేంద్రవరం మహిళ "వందన"


      తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిందన్నట్లు... బుద్ధిగా 'బి.పి.టి' (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరఫీ) చేసి డాక్టర్ అవ్వాలనుకున్న ఆ అమ్మాయి... తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకుని... చిరుద్యోగిగా మారాల్సి వచ్చింది. పెళ్లయి... పిల్లలు పుట్టాక- వాళ్ల ఆలనా పాలనా అలక్ష్యం చేయడం ఇష్టం లేక సొంతంగా ఉపాధి కల్పించుకోవాలనే ఉక్కు సంకల్పంతో... అంచెలంచెలుగా ఎదిగి... ఇప్పుడు తనే మూడొందల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ... అత్యంత ఆదర్శప్రాయంగా తన జీవితాన్ని మలచుకుంటోంది. రాజమండ్రికి చెందిన ఆ ధీర మహిళ పేరు "వందన".

     బి.పి.టి రెండో సంవత్సరంలో ఉండగా... కొన్ని ప్రత్యేక కారణాల వలన... తన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టిన వందన జాబులో జాయినయ్యింది. అయితే... సొంతంగా ఏదైనా చేయాలనే తపన వందనను కుదురుగా ఉండనీయలేదు. "పిల్లలు పుట్టాక... ఎప్పుడైనా వాళ్లకి ఒంట్లో నలతగా ఉన్నా సరే ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చిన రోజు మనసు మనసులో ఉండేది కాదు. నామీద నాకే కోపం, జాలి కలుగుతుండేది. అందుకే సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి స్వస్తి చెప్పి ఒకటి రెండు వ్యాపారాలు చేశాక... ఫైనల్ గా "పెన్సిల్ ఇండస్ట్రీ" ప్రారంభించానని చెబుతున్న వందన ఇప్పుడు కొన్ని వందల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. పెన్సిల్ తయారీలో తనే శిక్షణ ఇచ్చి... తయారైన పెన్సిల్స్ తనే కొనుగోలు చేస్తోంది. కేవలం లక్షా యాభైవేల పెట్టుబడితో... ఇంట్లోనే కూర్చుని "జీరో రిస్క్"తో నెలకు పాతిక నుంచి యాభై వేలు సంపాదించేలా వందలాది కురుంబాలను తీర్చిదిద్దుతున్న  వందనను అభినందించకుండా ఎవరూ ఉండలేరు!!


     తన తండ్రి పేరు "రాఘవ" (బర్ల రాఘవరావు)కు తన శ్రీవారి పేరు "శ్రీకాంత్" (కొల్లి శ్రీకాంత్)లోని "శ్రీ"ని జోడించి... "శ్రీరాఘవ ఎంట్రప్రెజస్" పేరుతో "పెన్సిల్ ఇండస్ట్రీ" నిర్వహిస్తున్న వందన... తన గెలుపు బాటలో... తన శ్రీవారితోపాటు... తన తల్లి-అన్నయ్యల సహాయ సహకారాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతుంది. సొంతంగా తమ కాళ్ల మీద నిలబడాలనుకునేవారు... వందనను 7989751220

నంబర్ లో నేరుగా సంప్రదించవచ్చు!!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: