బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి వెళ్లనున్నారా


కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరనున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో బుధవారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో బండి సంజ‌య్ ప‌ర్య‌టిస్తుండ‌గా... అక్క‌డికే వెళ్లిన విశ్వేశ్వ‌ర‌రెడ్డి ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

ఈ భేటీకి ముందు బీజేపీకి చెందిన మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డితోనూ విశ్వేశ్వ‌ర‌రెడ్డి భేటీ అయ్యారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా గురువారం నాడు మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న స‌మావేశానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌రు కానున్నారు. ఆయన ప‌ర్య‌ట‌న‌కు ఓ రోజు ముందు ఇలా బీజేపీ కీల‌క నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్న కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి బీజేపీలో చేర‌తారా? అన్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: