మేధోమధనం కోసం...రైలెక్కిన రాహుల్ గాంధీ


పార్టీ మేధోమధనం కోసం రెలెక్కారు రాహుల్ గాంధీ. ఎందుకు అంటారా...? 2024 ఎన్నికల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై మేధోమ‌ధ‌నం కోసం చింత‌న్ శిబిర్ పేరిట నిర్వ‌హిస్తున్న స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌లంతా రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ఆ పార్టీ నేత‌లు ఉద‌య్‌పూర్ చేరుకోగా... తాజాగా గురువారం ఆ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరారు. 

ఢిల్లీ నుంచి ఉద‌య్‌పూర్ చేరుకునేందుకు రాహుల్ గాంధీ రైలు ప్ర‌యాణాన్ని ఎంచుకున్నారు. ఈ మేర‌కు గురువారం ఢిల్లీలోని స‌రాయి రోహిల్లా రైల్వే స్టేష‌న్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ అక్క‌డే ఉద‌య్‌పూర్ ట్రైన్ ఎక్కేశారు. ఇదిలా ఉంటే... ఉద‌య్‌పూర్‌లో రేపు (జూన్ 13) ప్రారంభం కానున్న చింత‌న్ శిబిర్ ఈ నెల 15 వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల్సిందిగా పార్టీ అధిష్ఠానం 400 మంది కీల‌క నేత‌ల‌కు ఆహ్వానం పంపిన సంగతి తెలిసిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: