ఆ ఘటనలే  రాష్ట్ర ఆర్థిక దుస్థితికి నిదర్శనం


రాష్ట్రంలో నెలకొన్న  ఆర్థిక దుస్థితికి రాష్ట్రంలో  ఇటీవల నెలకొన్న ఘటనలే నిదర్శనమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కనీసం కార్లు కూడా సమకూర్చుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని ఆయన వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కుప్పంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం పర్యటనకు కార్లు ఇచ్చిన వారికి బిల్లులు చెల్లించకపోవడం రాష్ట్ర దుస్థితికి అద్దంపడుతోందని అన్నారు. 

సీఎం, వీఐపీ కాన్వాయ్ లకు అయిన ఖర్చు రూ.17.5 కోట్లు అని, తక్షణమే చెల్లించాలంటూ రవాణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంపై చంద్రబాబు పైవిధంగా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక  పెండింగ్ బిల్లు అంశంలా మాత్రమే చూడరాదని, ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి నిదర్శనంలా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజిని ఘోరంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత లేదు, సీఎంకు పాలన తెలియదు అని చంద్రబాబు విమర్శించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: