మల్థీవుల్లో రోహిత్ శర్మ...సతీమణితో కలసి జాలీ టూర్


క్రికెట్ రంగంలో ఉన్న ఒత్తిడి నుంచి కాస్త బయటపడేందుకు భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఉపసమనం కోసం విదేశీ యాత్రలకు వెళ్లాడు. రోహిత్ శర్మ తన భార్య రితికాతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 14 ఇన్నింగ్స్ లో రోహిత్ 19.14 సగటుతో 268 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతని హయ్యెస్ట్ స్కోరు 48 పరుగులు మాత్రమే. అంతేకాదు, ఈ సీజన్ లో రోహిత్ జట్టు ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. 

ఈ నేపథ్యంలో ఆ ఫెయిల్యూర్ మూడ్ నుంచి బయటపడేందుకు రోహిత్ తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. ఓ బీచ్ రిసార్ట్ లో తన భార్యతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు... మరిన్ని రోజులు ఇలాంటి ఏకాంతం కావాలని క్యాప్షన్ ఇచ్చాడు. 

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. కోహ్లీ, బుమ్రాలతో పాటు రోహిత్ కు కూడా విశ్రాంతిని కల్పించారు. జూన్ చివర్లో ఇంగ్లండ్ తో జరిగే టెస్టు మ్యాచ్ కు రోహిత్ మళ్లీ అందుబాటులోకి రానున్నాడు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: