వేసవి విజ్ఞాన శిబిరం గోడ పత్రికను విడుదల చేసిన...

గడివేముల  మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి, తహసిల్దార్ నాగమణి

(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలం లోని గడివేముల గ్రంధాలయ శాఖ గోడ పత్రికను గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహారెడ్డి ,తహసిల్దార్ నాగమణి "వేసవి విజ్ఞాన శిబిరం" గోడ పత్రికను విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే గడివేముల గ్రంధాలయ శాఖ వారు "వేసవి విజ్ఞాన శిబిరం"ను మే 17వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడివేముల మండల అభివృద్ధి అధికారి విజయసింహరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థిని,విద్యార్థులు అందరూ తమ స్నేహితులతో సరదాగా గడపడానికి ఎక్కువ సమయాన్ని బయట తిరగడానికి  కేటాయిస్తారని, మే నెల కావడంతో సూర్యుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుందని బయట తిరగడం వల్ల


విద్యార్థిని, విద్యార్థులు వడదెబ్బకు లోనవుతారని అందువల్ల విద్యార్థులు బయట తిరగకుండా గ్రంథాలయానికి వెళ్లి గ్రంథాలయంలో ఉండే పుస్తకాలు,పేపర్లు చదవడం వల్ల విద్యార్థిని,విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుందని సమాజంలో ఇతరులతో ఎలా కలిసి మెలసి ఉండాలనే ఆలోచన శక్తి నీ మెరుగుపరుచుకుంటారనిఆయన తెలిపారు. తాసిల్దార్ నాగమణి మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు అందరూ గ్రంథాలయానికి వెళ్లడానికి తల్లిదండ్రులు కూడా చొరవ తీసుకొని వారి పిల్లలను గ్రంథాలయానికి వెళ్లడానికి ప్రోత్సహించాలని, గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థిని,విద్యార్థులకు ఆలోచనా శక్తి మెరుగుపడుతుందని పిల్లల నడవడికలో, ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయని, వేసవి సెలవుల్లో సమయం వృధా చేయకుండా విద్యార్థిని, విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను చదువుకోని వారి విజ్ఞానాన్ని మెరుగు పరుచుకోవాలి అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గడివేముల గ్రంథాలయ శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి, మండల స్థాయి అధికారులు మరియు వీఆర్వోలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: