స్కూల్  చార్జీ ఇవ్వని డి.గోవిందుపై..

డీఈఓ కు పిర్యాదు చేసిన హెచ్ ఎం డి. శారదా దేవి

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల , బి. కాంప్ కర్నూలు లో గతంలో ఎఫ్.ఏ. సి గా పనిచేసిన డి. గోవిందు ప్రస్తుత హెచ్.ఎం గా పనిచేయుచున్న శారదా దేవి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బి క్యాంపు లో  హెచ్ఎం గా పనిచేయుచున్న శారదా దేవికి గత ఐదు నెలలుగా స్కూల్ చార్జీ లిస్ట్ అప్పగించకుండా గతంలో  ఎఫ్.ఏ.సీ గా పనిచేసిన డి.గోవిందు వేధిస్తున్నారని  హెచ్.ఎం శారదా దేవి కర్నూలు డీఈఓ రంగారెడ్డికి పిర్యాదు చేశారు. నాడు - నేడు పనులకు సంభందించిన బిల్స్ సకాలంలో రికార్డులు పొందుపరచ లేదని, విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రస్తుత హెచ్.ఎం శారదా దేవి కి ఆర్జేడీ, కడప వారు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.


గతంలో పనిచేసిన సుందరమ్మ, గోవిందులు నాడు- నేడు పనుల విషయాల్లో తప్పులు చేయగా, ప్రస్తుత హెచ్.ఎం శారదా దేవి కి నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె. సతీష్ కుమార్ ప్రశ్నించారు. తక్షణమే స్కూల్ లో జరిగిన నాడు-నేడు పనులపై విచారించి బాద్యులపై చర్యలు, వృధా అయిన ధనాన్ని రికవరీ చేయాలని మరియు ప్రస్తుత హెచ్.ఎం శారదా దేవి కి చార్జీలిస్ట్ తో సహా అన్ని రికార్డ్స్ అప్పగించేలా తగు ఆదేశాలు జారీ చేయాలని డీఈఓకు శారదా దేవి, సతీష్ కుమార్, ఆనంద్  విజ్ఞప్తి చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: