గడివేముల మండలం తహసిల్దార్ నాగమణి సీజ్ చేసిన...

వాహనాల విడుదలలోనున్న ఆంతర్యమేమిటి

ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేనిరాజునాయుడు


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసిన విషయంలో గడివేముల రెవెన్యూ అధికారులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి భాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేనిరాజునాయుడు డిమాండ్ చేశారు. బొల్లవరం గ్రామ ప్రజల సమష్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ మేరకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్యకు ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేనిరాజునాయుడు ఓ వినతి పత్రం అందజేశార. ఇదిలావుంటే మైనింగ్ కార్యకలాపాలకు , డీజిల్ బంకు ఏర్పాటుకు గడివేముల గ్రామ పరిధిలోని 497ఏ సర్వే నెంబర్లో పీ.ఎన్.సీ సంస్ధ వారికి అనుమతులిస్తే , చిందుకూరు గ్రామ పరిధిలోని 734 సర్వే నెంబర్లో కార్యకలాపాలు క్రషర్లు , డీజిల్ ట్యాంకులను ఎలా ఏర్పాటు చేసుకుంటారు . అని పీ.ఎస్.సీ సంస్ధపై చర్యలు తీసుకొని , గడివేముల రెవెన్యూ అధికారులపై నిష్పక్షపాతంగా


విచారణ జరిపి భాద్యులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలి. జేసీ నారపు రెడ్డి మౌర్య గారికి వినతి , వివిధ ప్రధాన పత్రికలలో వచ్చిన కధనాల ప్రతులను అందించిన నేతలు. పోతిరెడ్డిపాడు నుండి గోరుకల్లు జలాశయం వరకు విస్తరణ పనులను పీ.ఎన్.సీ నిర్మాణ సంస్ధ ఒక సంవత్సరం నుండి చేస్తున్నదీ , నిర్మాణ పనులకు అవసరమైన కంకరను గడివేముల ఎస్.ఆర్.బీ.సీ కాలువ పక్కన ఏర్పాటు చేసిన క్రషర్ మిషన్ ద్వారా తరలిస్తున్నారనీ , రోజు వందలాది టిప్పర్ల రాకపోకలతో కాలుష్యం , మరియు పంటపొలాలు దెబ్బతింటున్నాయనీ , కంకర రోడ్లపై పడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయనీ , రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయనీ తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 

బొల్లవరం గ్రామ సర్పంచు అంజనమ్మ , బొల్లవరం గ్రామం ప్రజలు గడివేముల తహశీల్దార్ కి ఫిర్యాదు చేయగా , స్పందించిన తహశీల్దార్ నాగమణి బుధవారం సాయంత్రం క్రషర్ దగ్గర తనిఖీలు నిర్వహించి మైనింగ్ కార్యకలాపాలకు , డీజిల్ బంకు ఏర్పాటుకు గడివేముల గ్రామ పరిధిలోని 497ఏ సర్వే నెంబర్లో పీ.ఎన్.సీ సంస్ధ వారికి అనుమతులిస్తే , చిందుకూరు గ్రామ పరిధిలోని 734 సర్వే నెంబర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలపడంతో వాటికి సంబంధించి ఎలాంటి ఆదారాలు చూపకపోవడంతో తహశీల్దార్ , ఆర్ఐ , వీఆర్వో ఐదు టిప్పర్లు , రెండు ప్రొక్లెయినర్లను సీజ్ చేసి అదే రోజు పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. గురువారం రోజు రాత్రి 9.30కు  సీజ్ చేసిన వాహనాల విడుదల చేయడంపై ఆంతర్యమేమిటనీ , అక్రమాలు జరుగుతున్నాయని గుర్తిచి సీజ్ చేసిన వాహనాలను రాత్రివేళ స్వాధీనం చేసుకొని పీ.ఎన్.సీ సంస్ధకు అప్పజెప్పడం వెనుక మతలబేమిటనీ కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ (ఏ.ఐ.ఎఫ్.బి) నాయకులు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్యని కలిసి సమష్యను వివరించి పీ.ఎన్.సీ సంస్ధపై చర్యలు తీసుకొని , సీజ్ చేసిన వాహనాల ఆంతర్యం , గడివేముల రెవెన్యూ అధికారులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి భాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని , బొల్లవరం గ్రామ ప్రజల సమష్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ సందర్బంగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు మాట్లాడుతూ మైనింగ్ కార్యకలాపాలకు , డీజిల్ బంకు ఏర్పాటుకు గడివేముల గ్రామ పరిధిలోని 497ఏ సర్వే నెంబర్లో పీ.ఎన్.సీ సంస్ధ వారికి అనుమతులిస్తే , చిందుకూరు గ్రామ పరిధిలోని 734 సర్వే నెంబర్లో కార్యకలాపాలు క్రషర్లు , డీజిల్ ట్యాంకులను ఎలా ఏర్పాటు చేసుకుంటారనీ ఆయన అన్నారు. ఈ తతంగం అంతా అధికారులకు తెలియదా అని ఆయన అన్నారు.

పీ.ఎన్.సీ సంస్ధ అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి జప్తు చేసిన వాహనాలను రాత్రి వేళ స్వాధీనం చేసుకొని పీ.ఎన్.సీ సంస్ధకు అప్పగించడం ఎంత వరకు సమంజసమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నేతలు ప్రతాప్ , శంకర్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: