డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు సాధించిన..

నంద్యాలకు చెందిన నూర్ బాషా

పలువురు ప్రముఖుల ప్రశంస


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, బయోటెక్నాలజీ విభాగంలో ఫుల్ టైమ్ రిసెర్చ్ స్కాలర్ అయిన నంద్యాల పట్టణ టెక్కె పోలీస్ లైన్ మస్జిద్ మవుజ్జన్ నజీర్ హుసేన్ కుమారుడు షేక్ నూర్ బాషా కు బయోటెక్నాలజీ లో పి.హెచ్.డి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అవార్డు లభించింది. క్యాన్సర్ విరుగుడు డ్రగ్ తయారిలో నూర్ బాషా చేసిన పరిశోధన "Expression and Purification of Recombinant L- Asparaginase Type II and the Development of Pegylected L- Asparaginase for Treatment of Acute Lymphoblastic Lukemia " కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆమోదించి డాక్టరెట్ ప్రదానం చేసింది. నూర్ బాషా తన సిద్ధాంత వ్యాసాన్ని డాక్టర్ మురళి కే.ఆర్. తుమ్మూరు పర్యవేక్షణలో సమర్పించారు. పేద మైనార్టీ కుటుంబానికి చెందిన డా.నూర్ బాషా నంద్యాలలోని ఖలీల్ సిద్ధీఖీ ఎయిడెడ్ హైస్కూలులో ఉర్దూ మీడియంలో పదవి తరగతి, కర్నూలు మైనారిటీ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉర్దూ మీడియంలో, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి, పీజి కళాశాలలో ఎం.ఎస్.సి బయోటెక్నాలజీ డిస్టింక్షన్ లో పూర్తి చేసారు. పేద కుటుంబమైన, జన్యురిత్య నాలుగు అడుగుల ఎత్తే అయిన ఏమాత్రం నిరాశ చెందక ఆత్మస్థైర్యం కోల్పోకుండా విద్యలో ఉన్నత స్ధానలు అధిరోహించాడు. ప్రస్తుతం హైదరాబాదులోని విర్కో బయోటిక్స్ లో పరిశోధన రంగంలో పని చేస్తున్నాడు. ఈ సందర్భంగా డా.నూర్ బాషా మాట్లాడుతూ పట్టుదల ఉంటే , సాధించే గమ్యం చేరువ అవుతుందన్నారు. ఎందరో పేద పిల్లలను ప్రోత్సహించె జమాతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ స్వయానా తన చిన్నాన్న అని, ప్రతి మలుపులో ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. నంద్యాల వాసికి డాక్టరేట్ రావడం పట్ల పలువురు ప్రశంసించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: