తల వంచుతున్న రష్యా... ఉక్రెయిన్ అనుకూల దేశాల విశ్లేషణ


రష్యా అనుకున్నది ఒక్కటి అవుతున్నది ఇంకోటి అన్నట్టు పరిస్థితి తయారైంది. రష్యా ఈ విషయంలో ఉక్రెయిన్ అనుకూల దేశాలు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా పట్టు కోల్పోయిందని, రష్యా అనుకున్నది అవ్వడం లేదని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే పోరాట సామర్థ్యం తగ్గి రష్యా సైనికులు లొంగిపోతున్నారని, వెంటవెంటనే సైనికులను భర్తీ చేయకపోవడంతో అనుకున్న విధంగా పనులు జరగడం లేదని పేర్కొంది. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం రష్యా రాబోయే 30 రోజుల్లో ఆక్రమణ చర్యను వేగవంతం చేసే అవకాశం లేదని పేర్కొంది.

అలాగే ఖార్కివ్ ప్రాంతంలోని కీవ్ దళాలు దాదాపు రష్యా సరిహద్దుకు చేరుకున్నాయని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు వాడిమ్ డెనిసెంకో గతంలో చెప్పారు. ఉక్రెయిన్ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్ 127వ బ్రిగేడ్ 227వ బెటాలియన్ రష్యా సరిహద్దుకు చేరుకుందని, తాము విజయానికి దగ్గరలో ఉన్నామని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. అలాగే ఉక్రెయిన్ సైనికులు రష్యా సరిహద్దుకు చేరుకున్న వీడియోను కూడా ఉక్రెయిన్‌లోని ఆస్ట్రియా మాజీ రాయబారి అలెగ్జాండర్ చెర్బా ట్విట్టర్‌లో కూడా షేర్ చేశారు. ఇది ఇలా ఉంటే ఉక్రెయిన్ ఈ యుద్ధంలో విజయం సాధిస్తుందని, ఉక్రెయిన్ సైనికులు ధైర్యంగా తమ మాతృభూమిని రక్షించుకుంటున్నారని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ జోడించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: