సూర్యుడి ప్రతాపానికి--

నీరు దొరకక వానరాలు (కోతులు)విలవిల


(జానో జాగో వెబ్ న్యూస్- గడివేముల ప్రతినిధి)

         నంద్యాలజిల్లా,గడివేముల మండలంలో వేసవికాలం మే నెలలో సూర్యుడు తన ప్రతాపాన్ని 44 డిగ్రీలు చూపించుచుడంతో ప్రజలే కాకుండా వానరాలు (కోతులు), మూగజీవాలు సైతం తమ దాహార్తిని తీర్చుకోవడానికి అల్లాడుతున్నాయి. సూర్యుడి ప్రతాపం మే నెలలో ఎండలు మండుతుండడంతో   వానరాలు, మూగజీవాలు కాకుండా ప్రజలు సైతం నీటి కోసం విలవిల లాడుతున్నారు.వానరాలు ఎక్కడైనా నీరు దొరకక పోతుందా అని జన వాసులు త్రాగి పడవేసిన బాటిల్ లను, నీటి ప్యాకెట్లను,ప్రజల ఇళ్ల వద్ద బయట ఉంచిన బకెట్ల లోనీ నీటి కోసం వెతికి మరీ తమ దాహార్తిని తీర్చి ఉంటున్నాయి.


గడివేముల మండలంలో పూర్వీకులు దేవాలయాల సంరక్షణ కొరకు 1063 ఎకరాల దేవుని మాన్యం భూములు ఉన్నాయి అయితే ఎండోమెంట్ అధికారులు దేవాదాయ  భూములను వేలంపాటలు వేసి ఆదాయాన్ని తీసుకుంటున్నారు తప్ప, దేవాలయాల భూముల మీద వచ్చే ఆదాయంలో ఒకే ఒక్క శాతం అయినా ఖర్చు చేసి వానరాలకు (కోతులకు) అక్కడ అక్కడ నీటి తొట్టలను ఏర్పాటు చేసి మూగజీవాల దాహార్తిని తీర్చడానికి ఎండోమెంట్

అధికారులు గాని, ఉన్నతాధికారులు కానీ, అధికారులు కానీ, చొరవ తీసుకొని వానరాలకు వేసవికాలంలో వానరాలు (కోతులు), మూగజీవాల  దాహార్తిని తీర్చేందుకు అక్కడ అక్కడ  నీటి తోట్టులను ఏర్పాటు చేసి మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు  కృషి చేయాలని గడివేముల మండలంలోని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: