గాయమైన గొప్ప ఆటగాడా


ఐపీఎల్ సీజన్ మ్చాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచేసింది. 13 పరుగుల తేడాతో చెన్నైని మట్టి కరిపించింది. అయితే, ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇన్నింగ్స్ లో మ్యాక్స్ వెల్ రనౌట్ హలైట్. కోహ్లీ స్ట్రైక్ చేసిన రన్ కోసం పిలవగా.. ఊతప్ప విసిరిన పర్ ఫెక్ట్ త్రోకు మ్యాక్సీ రనౌట్ అయ్యాడు. 

అయితే, ఈ విజయం తర్వాత డ్రెస్సింగ్ రూంకు సంబంధించి ఆర్సీబీ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో కింగ్ కోహ్లీ, మ్యాక్స్ వెల్ మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ‘‘వామ్మో.. నేను నీతో కలిసి బ్యాటింగ్ చేయలేను. నువ్వు చాలా వేగంగా పరుగు తీస్తావు. అంత వేగమా! నువ్వు సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులు పెట్టిస్తావు. నా వల్ల కాదు బాబూ’’ అంటూ కోహ్లీతో మ్యాక్సీ సరదాగా తన రనౌట్ గురించి వ్యాఖ్యానించాడు. 

వాస్తవానికి డ్రెస్సింగ్ రూంలో ఈ సరదా వ్యాఖ్యలను స్టార్ట్ చేసింది కోహ్లీనే. లోపలికి వస్తున్న మ్యాక్స్ వెల్ ను ఉద్దేశిస్తూ కోహ్లీ సెటైర్లు వేశాడు. ‘గాయమైన గొప్ప ఆటగాడు’ అంటూ కామెంట్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో 4 ఓవర్లలో 22 పరుగులే ఇచ్చి అంబటి రాయుడు, రాబిన్ ఊతప్పల వికెట్లు కూల్చిన మ్యాక్స్ వెల్.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  ‘‘ఇది చాలా మంచి విజయం. చాలా ముఖ్యమైనది. చరిత్రలోనే ‘గాయమైన గొప్ప ఆటగాడు’ అందించిన గెలుపు’’ అంటూ పగలబడి నవ్వేశాడు.   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: