ఈ నెల 11న ఓటీటీలోకి బీస్ట్ సినిమా


ఓటీటీ అభిమానులకు ఓ శుభవార్త. విజయ్ హీరోగా తెరకెక్కిన 'బీస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించడం .. నెల్సన్ దిలీప్ కుమార్ అంతకుముందే 'డాక్టర్' వంటి హిట్ ఇచ్చి ఉండటం .. 'అరబిక్ కుతు' సాంగ్ బాగా పాప్యులర్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోయాయి.

అయితే సినిమా విడుదలైన తరువాత అంచనాలను అందుకోలేకపోయింది. కథాకథనాల పరంగా ప్రేక్షకులను ఎంతమాత్రం అలరించలేకపోయింది. ఇది విజయ్ స్థాయి సినిమా కాదనే విషయాన్ని ఆడియన్స్ తేల్చి పారేశారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అయిపోయింది.

ఈ నెల 11వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోను .. సన్ నెక్స్ట్ లోను స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్లను తాజాగా వదిలారు. ఇక ఓటీటీ మార్కెట్ నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టు రాబడుతుందనేది చూడాలి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోయినా ఇదే బ్యానర్లో రజనీతో నెల్సన్ సినిమా చేస్తుండటం విశేషం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: