క్రాంప్టన్  కూల్ బ్రీజ్ డెజర్ట్ కూలర్ సిరీస్ మార్కెట్లోకి


క్రాంప్టన్  కూల్ బ్రీజ్ డెజర్ట్ కూలర్ సిరీస్ మార్కెట్లోకి వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. చల్లగా ఉండడం ముఖ్య మైపోయింది. అధిక పనితీరు, శక్తి సామర్థ్యంతో తక్షణ కూలింగ్ ను అందించే ఎయిర్ కూలర్ మీరు ఈ సీజన్ ను తేలిగ్గా అధిగమించేందుకు తోడ్పడుతుంది. ఫ్యాన్లు వంటి కూలింగ్ ఉత్పాదనల్లో 80 ఏళ్ల అనుభవం కలిగిణ క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తన కూలింగ్ ఉత్పాదనల శ్రేణికి మరో వినూత్నతను జోడించిం ది. కూల్ బ్రీజ్ డెజర్ట్ కూలర్ సిరీస్ ను ఆవిష్కరించింది. తిరుగులేని అత్యున్నత స్థాయి పనితీరు, అధునాతన సాంకేతికత, విలక్షణ వినియోగదారు స్నేహపూర్వక ఫీచర్లతో క్రాంప్టన్ అందించే ఈ శ్రేణి సౌకర్యం, సౌలభ్యంతో కూడిన చల్లటి వేసవిని అందిస్తుంది. ఈ సందర్భంగా క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అప్లియెన్సెస్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సచిన్ ఫర్తియాల్ మాట్లాడుతూ, ‘‘ఎండలు గతంలో కంటే అధికంగా ఉంటున్నాయి, వేడి నుంచి తక్షణ ఉపశమనం పొందడం ముఖ్యమైందిగా మారింది. వడగాడ్పులు సాధారణమైపోయాయి. ఆధునిక వినియోగదారులు బయ ట పని చేసి అలసపోయిన తరువాత ఇంట్లోకి రాగానే తక్షణ కూలింగ్ ను కోరుకుంటున్నారు. తక్షణ కూలింగ్, అత్యున్నత నాణ్యత, సామర్థ్యపూర్వక పనితీరు అందించడం ద్వారా ఏళ్లుగా క్రాంప్టన్ వినియోగదారుల జీవి తాలను మెరుగుపరచడాన్ని నిరంతర లక్ష్యంగా చేసుకుంది అని ఆయ‌న అన్నారు. వాతావరణం బాగా వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత భయంకరంగా ఉండనున్నాయి. అది అవసరం కూడా. వేడి ని పోగొట్టుకునేందుకు మాత్రమే కాదు, శారీరకంగా, మానసికంగా కాస్తంత సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని అనుభూ తి చెందేందుకు. ఇందుకు గాను అందుబాటు ధర, మన్నిక, శక్తిసామర్థ్యం లతో ఎక్కడైనా, ఎప్పుడైనా అందిం చగలిగే చల్లదనంతో కూలర్లు ఈ విభాగంలో తమ పైచేయిని ప్రదర్శిస్తుంటాయి. వినియోగదారు అనుభూతిని పెంచేందుకు గాను క్రాంప్టన్ తన నూతన శ్రేణి ఎయిర్ కూలర్లను ఆవిష్కరించింది. 


కూల్ బ్రీజ్ శ్రేణి ఎయిర్ కూలర్లు క్రాంప్టన్ కు చెందిన 1.5 లక్షల రిటైల్ పాయింట్స్ లో మరియు ఈ- కామర్స్ చానల్స్ లోనూ లభ్యమవుతాయి.   బాగా వేడిగా ఉండే రోజున కూడా అత్యుత్తమ తక్షణ కూలింగ్ ను అందించేలా ఇవి డిజైన్ చేయబడ్డాయి. వీటిలో దిగువ విశిష్టతలు ఉన్నాయ‌ని సంస్థ నిర్వ‌హ‌కులు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సచిన్ ఫర్తియాల్ తెలిపారు. .

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: