ఆ ప్రమాదంపై ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరణ


ఇటీవల ఝార్ఖండ్ లో నెలకొన్న రన్ వే ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించి కేసును సమోటోగా స్వీకరించింది. ఝార్ఖండ్ లోని ప్రఖ్యాత పర్యాటక స్థలం త్రికూట పర్వతాల వద్ద రోప్ వే ప్రమాదం సంభవించడం తెలిసిందే. బైద్యనాథ్ ఆలయానికి దారితీసే రోప్ వేలో రెండు కేబుల్ కార్లు ఢీకొనడమే ఈ ప్రమాదానికి కారణం. దాంతో కేబుల్ కార్లలోని ప్రజలు 45 గంటలపాటు గాల్లోనే చిక్కుకుపోయారు. ఇదిలావుంటే, అధికారులు వాయుసేన సాయం చేపట్టిన సహాయక చర్యలు ముగిశాయి. రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి. 45 మందిని కాపాడగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో  ఈ ప్రమాద ఘటనను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రమాదం జరిగిన తీరుపై విచారణకు ఆదేశించింది. ఈ నెల 26న వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: