నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి: కేజీఎఫ్ డైరెక్టర్


తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అని కేజీఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నారు. కన్నడ స్టార్ హీరో యష్ తాజా చిత్రం 'కేజీఎఫ్ 2' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా తిరుపతిలో చిత్ర బృందం సందడి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవిపై తనకెంత అభిమానం ఉందో చెప్పారు. 

తనకు స్ఫూర్తి చిరంజీవేనని ప్రశాంత్ నీల్ అన్నారు. చిన్నప్పటి నుంచి తాను చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగానని చెప్పారు. తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని తెలిపారు. తన సినిమాలో హీరోకు ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్, మాస్ ఎలిమెంట్ సీన్స్ చాలా బాగుంటాయని చెపుతుంటారని.... దీనికి కారణం చిరంజీవేనని చెప్పారు. చిరంజీవి సినిమాల్లో ఉండే ఈ సీన్స్ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. తన సినిమాలో హీరో కూడా చిరంజీవి మాదిరే ఉండాలని అనుకున్నానని చెప్పారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: