మ్యాచ్ మధ్యలో విషాదం...గ్యాలరీ కూలింది


పుట్ బాల్ మ్యాచ్ సాగుతుండగా స్టేడియంలో విషాదం చోటుచేసుకొంది. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చి 200 మంది గాయాల‌పాల‌య్యారు. మ్యాచ్ జ‌రుగుతుండ‌గా అక్క‌డి తాత్కాలిక‌ గ్యాల‌రీ ఒక్క‌సారిగా కూలిపోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. కేర‌ళ‌లోని మ‌లప్పురం పూంగోడ్ లో నిన్న ఫుట్‌బాల్ మ్యాచ్ పోటీలు నిర్వ‌హించారు. అందుకోసం అక్క‌డ తాత్కాలిక‌ గ్యాల‌రీ ఏర్పాటు చేశారు. అయితే, అది ఒక్క‌సారిగా కూలిపోయింది.  అది కూలిపోతోన్న స‌మ‌యంలో అక్క‌డి వారు ప‌రుగులు తీసిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. వేగంగా అది ప్రేక్ష‌కుల మీద ప‌డిపోవ‌డంతో దాదాపు 200 మందికి గాయాల‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. వారిలో ఐదుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వివ‌రించారు. తాత్కాలిక గ్యాల‌రీ కూలిపోయిన వీడియో మీడియాకు ల‌భ్య‌మైంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: