రష్యా ముందు ఉక్రెయిన్ల గుండే ధైర్య ప్రదర్శన


బలమైన శత్రువు ఎదురొస్తున్న ఉక్రెయిన్ జనంలో మాత్రం బెణుకుకనిపించడంలేదు. ఉక్రెయిన్‌-రష్యా మ‌ధ్య‌ యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఉక్రెయిన్ పౌరులు ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. సాధారణ పౌరుల నుంచి కూడా ర‌ష్యా సైనికుల‌కు ప్రతిఘటన ఎదురవుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఉక్రెయిన్‌లోని బఖ్‌మాచ్ వీధుల్లో ఒక వ్యక్తి రష్యన్‌ యుద్ధ ట్యాంకుని ఒంటి చేత్తో పట్టుకుని ఆపేయ‌డానికి య‌త్నించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొదట ట్యాంక్ పైకి ఎక్కిన ఆ వ్య‌క్తి.. ఆ త‌ర్వాత కింద‌కు దిగి తన చేతులతో ట్యాంక్‌ను నెట్టడానికి య‌త్నించాడు. అయినా ట్యాంక్ ముందుకు వెళ్తుండ‌డంతో ట్యాంకు ముందు మోకాళ్ల‌పై నిల‌బ‌డ్డాడు. చివ‌ర‌కు ఆ యుద్ధ ట్యాంకు ముందుకు వెళ్ల‌లేక‌పోయింది. ఈ వీడియోను ఉక్రెయిన్ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అవుతోంది. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: