నాగ చైతన్య సరసన..మరోసారి పూజా హెగ్డే మెరవనున్నదా


కొందరు హీరోలతో పూజా హెగ్డే కాంబినేషన్ సూపర్ అన్నట్లుగా ప్రచారముంది. తాజాగా ఆమె వరుసబెట్టి స్టార్ హీరోయిల సరసన నటిస్తోంది. ఇదిలావుంటే పూజ హెగ్డే తాజా చిత్రంగా ఆమె నుంచి ఇటీవల ' రాధే శ్యామ్' వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సందడి చేస్తుండగా, ఏప్రిల్ 13వ తేదీన 'బీస్ట్' రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె విజయ్ జోడీగా అందాల సందడి చేయనుంది. ఇక అదే నెల 29వ తేదీన 'ఆచార్య' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉండనుంది. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్న         సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. ఇక ఆ తరువాత సినిమాలో ఆమె నాగచైతన్య సరసన అలరించనున్నట్టు సమాచారం. తెలుగులో పూజ హెగ్డే ఫస్టు మూవీ నాగచైతన్యతోనే మొదలైంది.  'ఒక లైలా కోసం' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాతనే ఆమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు .. తమిళ భాషల్లో వెంకట్ ప్రభు రూపొందించనున్న సినిమాలో ఈ జంట మరోసారి కనువిందు చేయనుంది. ఈ విషయాన్ని వెంకట్ ప్రభు స్వయంగా చెప్పడం విశేషం.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: